Carrot Kheer Recipe cooking tips By , 2015-01-05 Carrot Kheer Recipe cooking tips Carrot Kheer Recipe cooking tips : the cooking tips to make carrot kheer recipe. Prep Time: 20min Cook time: 20min Ingredients: ఒక కప్పు క్యారెట్ తురుము, 1/2 లీటర్ పాలు, 2 టీ స్పూన్స్ నెయ్యి, 100 గ్రాములు కోవా, ఒక కప్పు పంచదార, 25 గ్రాములు డ్రైఫ్రూట్స్, 1/2 టీ స్పూన్ యాలకులపొడి, Instructions: Step 1 స్టౌవ్ మీద ఒక బాణలి పెట్టి అందులో కొద్దిగా నెయ్యి వేసి వేయించాలి. నెయ్యి కాగిన తర్వాత అందులో డ్రైఫ్రూట్స్ వేసి కొద్దిసేపటి వరకు ఉడికించుకోవాలి. అనంతరం క్రిందకు దించేసి పక్కన పెట్టుకోవాలి. Step 2 ఇప్పుడు అదే పాన్’లో మరికొద్దిగా నెయ్యి వేసి వేయించిన తర్వాత.. క్యారెట్ తురుము వేసి దోరగా వేయించుకోవాలి. అనంతరం తురుమును కూడా క్రిందకు దించేసి.. పక్కన వుంచుకోవాలి. Step 3 మరో స్టౌవ్’పై మరొక పాత్ర పెట్టి అందులో కొద్దిగా పాలు పోసి మరిగించుకోవాలి. పాలు మరుగుతుండగానే అందులో కోవా కలుపుతూ వుండాలి. Step 4 అలా పాలను 10 నిముషాలపాటు ఉడికించిన తర్వాత అందులో వేయించి ఉంచుకున్న క్యారెట్ తురుమును, పందార వేసి మిక్స్ చేస్తూ మరో 10 నిముషాలు వేయించాలి. Step 5 ఇలా వేడి చేసిన అనంతరం క్రిందకు దించేముందు ఇదివరకు వేయించిన డ్రైఫ్రూట్స్’తో గార్నిష్ చేసుకోవాలి. అంతే! క్యారెట్ ఖీర్ రెడీ!
Yummy Food Recipes
Add