chicken capsicum recipe cooking tips special roti curry By , 2015-01-03 chicken capsicum recipe cooking tips special roti curry chicken capsicum recipe cooking tips special roti curry : the cooking tips to make chicken capsicum recipe. It is special curry for chapati's in weekend. Prep Time: 30min Cook time: 30min Ingredients: 1/2 కేజీ చికెన్, 1/4 కేజీ క్యాప్సికమ్, 150 గ్రాములు ఉల్లిపాయలు, 6 రేకలు వెల్లుల్లి, నాలుగు పచ్చిమిర్చి, 1/4 టీ స్పూన్ గరంమసాలా, చిన్న ముక్క అల్లం, 1/2 టీ స్పూన్ పసుపు, తగినంత నూనె, సరిపడా ఉప్పు, అరకప్పు పెరుగు, 1/2 టీ స్పూన్ ధనియాలపొడి, తగినంత కొత్తిమీర తరుగు, 1/2 కప్ టమోటా ముక్కలు, Instructions: Step 1 చికెన్’ను శుభ్రంగా కడిగేసుకున్న అనంతరం ముక్కలుగా కట్ చేసుకుని, వాటిని తగినంత ఉప్పు, కారం, పసుపు తగిన పదార్థాలతో మ్యారినేట్ చేసి కొద్దిసేపటివరకు నానబెట్టుకోవాలి. Step 2 మరోవైపు క్యాప్సికమ్స్’ను పొడవు ముక్కలుగా తరగాలి. అలాగే ఉల్లిపాయల్ని పొడవుగాగానీ, రౌండ్’గా గానీ స్లైసుల్లాగా కోయాలి. అల్లంవెల్లుల్లను సన్నగా తరగి వుంచుకోవాలి. Step 3 ఇప్పుడు ఒక పాన్ తీసుకుని అందులో కొద్దిగా నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక అందులో అల్లంవెల్లుల్లి ముక్కల్ని వేసి కాసేపు వేయించాలి. తర్వాత క్యాప్సికమ్స్, ఉల్లిపాయ ముక్కల్ని వేసి 5 నిముషాలపాటు వేయించాలి. Step 4 కొద్దిసేపటి తర్వాత అందులో ఇదివరకు నానబెట్టి వుంచుకన్న చికెన్ ముక్కల్ని వేసి.. కాస్త పెద్ద మంటమీద ఉడికించుకోవాలి. చికెన్ ముక్కలు మెత్తబడేవరకు ఎక్కువ మంటమీదే వేయించాలి. Step 5 చికెన్ మెత్తబడగానే టమోటా ముక్కల్ని కలిపి మూతపెట్టి వేడి చేయాలి. కాసే తర్వాత పచ్చిమిర్చి, గరంమసాలా, ధనియాల పొడుల్ని కలిపి ఉడికించాలి. ఇక దించేముందు కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేయాలి. అంతే!
Yummy Food Recipes
Add
Recipe of the Day