soyabean paratha recipe By , 2017-06-14 soyabean paratha recipe Here is the process for soyabean paratha making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 10min Ingredients: సోయా గ్రాన్యూవల్స్‌ - 3/4 కప్పు,,ఉల్లిపాయ - 1,,టమోటా - 1,,పసుపు - చిటికెడు,,కారం, గరం మసాల - 1 టీ స్పూను చొప్పున,,దనియాల పొడి - 2 టీ స్పూన్లు,,కొత్తిమీర తరుగు - అరకప్పు,,అల్లం వెల్లుల్లి పేస్టు - ఒకటిన్నర స్పూన్లు,,ఉప్పు - రుచికి తగినంత,,నూనె - 2 టేబుల్‌ స్పూన్లు,,సోంపు - 1 టీ స్పూను,,గోధుమపిండి - 1 కప్పు., Instructions: Step 1 గోధుమపిండిలో గోరువెచ్చని నీరు, 1 టేబుల్‌ స్పూను నూనె, చిటికెడు ఉప్పు కలిపి మెత్తగా చపాతీ పిండిలా కలిపి పక్కనుంచాలి.   Step 2 నూనెలో సోంపు, ఉల్లి తరుగు, అల్లం వెల్లుల్లి పేస్టు, టమోటా తరుగు, ఉప్పు ఒకటి తర్వాత ఒకటి వేసి వేగించాలి.  Step 3 ఆ తర్వాత కారం, గరం మసాల, దనియాలపొడి, పసుపులతో పాటు (గోరువెచ్చని నీటిలో 5 నిమిషాలు నానబెట్టి, నీరు పిండిన) సోయా గ్రాన్యూవల్స్‌ కూడా వేసి పావు కప్పు నీరు పోసి మూత పెట్టాలి.  Step 4 నీరు ఇగిరి ‘కీమా’మాదిరి పొడిపొడిగా అయ్యాక కొత్తిమీర చల్లి దించేయాలి.    Step 5 ఈ కూరని చపాతీ మధ్య కొద్దిగా పెట్టి అన్ని వైపులా మడిచి రెండువైపులా పెనంపై నూనెతో కాల్చుకోవాలి. ఇవి రైతాతో బాగుంటాయి.              
Yummy Food Recipes
Add
Recipe of the Day