egg curry andhra style recipe cooking tips By , 2015-01-02 egg curry andhra style recipe cooking tips egg curry andhra style recipe cooking tips : the cooking tips to make egg curry recipe in andhra style. It very tasty, spicy than other egg recipes. It contains healthy ingradients also. Prep Time: 30min Cook time: 25min Ingredients: 4-6 ఉడికించిన గుడ్లు, 1-2 ఉల్లిపాయలు (సన్నగా తరగాలి), 3-5 పచ్చిమిర్చి (సన్నగా తరగాలి), 2-3 టమోటాలు (సన్నగా తరగాలి), 1 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్స్ కారం, 1 టీ స్పూన్ ధనియాలపొడి, 1 టీ స్పూన్ చింతపండు గుజ్జు, 1 టీ స్పూన్ బెల్లం, రుచికి తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 2 రెమ్మలు కరివేపాకు, 2 టీ స్పూన్స్ కొత్తమీర తరుగు, వంటకానికి సరిపడేంత నూనె, Instructions: Step 1 ఒక పాన్ తీసుకుని అందులో కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి. నూనె కాగిన తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి ఒక నిముషంవరకు ఫ్రై చేయాలి. అనంతరం వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు వేసి మరో 5 నిముషాల వరకు వేయించాలి. Step 2 ఇప్పుడు అందులోనే పచ్చిమిర్చి ముక్కలు, పసుపు, కారం, ధనియాలపొడి వేసి మరో 3 నిముషాలపాటు ఉడికించాలి. తర్వాత టమోటా ముక్కలు, చింతపండుగుజ్జు వేసి 5 నిముషాల వరకు ఫ్రై చేసుకోవాలి. Step 3 టమోటా గుజ్జు మెత్తబడిన తర్వాత అందులో బెల్లం, ఉప్పు వేసి.. మొత్తం మిశ్రమాన్ని కలియబెడుతూ 10 నిముషాలవరకు వేడి చేయాలి. ఇప్పుడు ముందుగా ఉడికించిన గుడ్లకు గాట్లుపెట్టి.. ఈ గ్రేవీలో వేయాలి. అంతే! ఆంధ్రాస్టైల్లో ఎగ్ కర్రీ రెడీ!
Yummy Food Recipes
Add