tomato gravy recipe cooking tips healthy food item By , 2014-12-23 tomato gravy recipe cooking tips healthy food item tomato gravy recipe cooking tips healthy food item : the cooking tips to make tomato gravy recipe which is contains healthy and beauty ingredients. Prep Time: 30min Cook time: 25min Ingredients: 1-2 కప్స్ టమోటోల గుజ్జు, 1/2 కప్ ఉల్లిపాయల గుజ్జు, 1/2 కప్ కొబ్బరి తురుము, 1 టీ స్పూన్ పచ్చిమిర్చి పేస్ట్, 1 టీ స్పూన్ కారం, వంటకానికి సరిపడేంత కరివేపాకు, వంటకానికి సరిపడేంత ఆవాలు, వంటకానికి సరిపడేంత కొబ్బరి నూనె, రుచికి తగినంత ఉప్పు, కొద్దిగా పసుపు, Instructions: Step 1 స్టౌవ్ మీద ఒక పాన్ పెట్టి అందులో కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి. నూనె కాగిన తర్వాత అందులో కొద్దిగా ఆవాలు వేయాలి. అవి చిటపటలాడిన అనంతరం పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. Step 2 ఫ్రై చేసిన తర్వాత అందులో టమోటా గుజ్జును వేసి.. పచ్చి వాసన పోయేంతవరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేస్తుండగానే అందులో కాసింత నీరు చేర్చుకోవాల్సి వుంటుంది. Step 3 మరోవైపు మిక్సీ జార్’లో కొబ్బరి తురుము, ఉల్లిపాయలు, కొద్దిగా నీళ్లు జోడించి మెత్తగా పేస్టులా రుబ్బుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఉడుకుతున్న టమోటా గ్రేవీ మిశ్రమంలోకి చేర్చుకుని ఉడికించాలి. Step 4 2 నిముషాల తర్వాత అందులో కారం, పసుపు, ఉప్పు, కరివేపాకు తదితర పదార్థాలు వేసి మొత్తం మిశ్రమాన్ని కలగలుపుకొని ఉడికించాలి. అలాగే ఇందులో నీళ్ళు పోసి మరో 10 నిముషాలు ఉడికించుకోవాలి. అంతే!
Yummy Food Recipes
Add