rava laddu recipe making tips home made food items By , 2014-12-23 rava laddu recipe making tips home made food items rava laddu recipe making tips home made food items : the cooking tips to make rava laddu recipe in easy steps. Prep Time: 30min Cook time: 20min Ingredients: 300 గ్రాములు బొంబాయి రవ్వ, 250 గ్రాములు శనగపిండి (వేయించినది), 500 గ్రాములు పంచదార, 50 గ్రాములు జీడిపప్పు, 250 గ్రాములు నెయ్యి, ఒక చిప్ప ఎండుకొబ్బరి (కోరి వుంచాలి), 6-8 యాలకులు, Instructions: Step 1 మొదట స్టౌవ్ మీద ఒక పాన్ పెట్టి అందులో కొద్దిగా నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి కాగిన అనంతరం అందులో జీడిపప్పును వేసి వేయించాలి. అలా వేయించిన జీడిపప్పును పక్కన పెట్టుకోవాలి. Step 2 మిగిలిన నెయ్యిలో రవ్వను వేసి కొద్దిసేపటివరకు ఉడికించుకోవాలి. లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేంతవరకు రవ్వను వేయించిన అనంతరం దానిని పక్కన పెట్టుకోవాలి. ఒకవేళ రవ్వ మొరుముగా వుంటే దంచుకోవాలి. Step 3 ఇప్పుడు స్టౌ మీద మరో పాత్ర వుంచి.. అందులో కొంచెం నీళ్లు పోసి, పంచదారనూ కలిపి ఉడికించాలి. అది తీగపాకం వచ్చేంతవరకు కలుపుతూ వేయిస్తూనే వుండాలి. Step 4 అనంతరం ఆ పాకంలో ఇదివరకు వేయించి పక్కన పెట్టుకున్న రవ్వ, జీడిపప్పు మిశ్రమాలతోబాటు శనగపిండి, ఎండుకొబ్బరి, యాలకులను కలిపి.. మొత్తం మిశ్రమాన్ని మిక్స్ చేస్తూ మీడియం మంట మీద వుండలుగా చేసుకోవాలి. అంతే! టేస్టీ రవ్వ లడ్డు రెడీ!
Yummy Food Recipes
Add