cilantro rice recipe cooking tips vegetarians special food item By , 2015-01-03 cilantro rice recipe cooking tips vegetarians special food item cilantro rice recipe cooking tips vegetarians special food item : the simple cooking tips to make cilantro rice recipe which is good for health. Prep Time: 20min Cook time: 20min Ingredients: రెండు కప్పులు బియ్యం, ఒక పెద్ద కట్ట కొత్తిమీర, 4 లేదా 6 పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం, ఆరు రెబ్బలు వెల్లుల్లి, 2 లేదా 3 టమోటాలు, తగినంత ఉప్పు, 2 టీ స్పూన్స్ నెయ్యి, 6 లేదా 7 లవంగాలు, 2 లేదా 3 యాలక్కాయలు, 2 ముక్కలు దాల్చిన చెక్క, Instructions: Step 1 ఒక పాత్ర తీసుకుని అందులో కొద్దిగా నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి కాగిన తర్వాత అందులో పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి ఓ నిముషంపాటు వేయించి, తర్వాత క్రిందకు దించి చల్లార్చుకోవాలి. Step 2 వేయించిన కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి అన్నింటిని పేస్టులా కలగలుపుకోవాలి. ఒకవేళ ఈ మిశ్రమం గట్టిగా వున్నట్లు అనిపిస్తే.. కొద్దిగా నీళ్లు కలుపుకుని మెత్తగా చేసుకోవాలి. Step 3 ఇప్పుడు ఓ కడాయి తీసుకుని అందులో నెయ్యి వేసి వేయించాలి. నెయ్యి కాగిన తర్వాత అందులో లవంగాలు, యాలక్కాయలు, దాల్చినచెక్కలు వంటి మసాలా దినుసుల్ని వేసి వేయించాలి. అవి వేగిన తర్వాత కొత్తిమీర పేస్టు వేసి.. కలుపుతూ వేయించాలి. Step 4 అందులోనే టమోటా ముక్కల్ని కలిపి 5 నిముషాలపాటు వేయించి ఉప్పు కలుపుకోవాలి. ఇందులో మూడున్నర కప్పుల నీటిని పోసి బాగా మరిగించాలి. ఇది మరుగుతుండగానే ఇదివరకు నానబెట్టిన బియ్యాన్ని వేసి కలియబెట్టుకోవాలి. అన్నం అయ్యేంతవరకు వుంచి తర్వాత క్రిందకు దించేయాలి. అంతే! కొత్తిమీర అన్నం రెడీ!
Yummy Food Recipes
Add