dry fruit laddu By , 2018-07-11 dry fruit laddu Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty dry fruit laddu making in best way. Prep Time: 10min Cook time: 30min Ingredients: జీడిపప్పు - ఒక కప్పు,బాదంపప్పు- ఒక కప్పు,పిస్తాపప్పు - ఒక కప్పు,ఖర్జూరాలు - 250 గ్రాములు,గసగసాలు - 50 గ్రాములు,నెయ్యి - 100 గ్రాములు,పంచదార - 100 గ్రాములు,ఏలకులు - 4, Instructions: Step 1 లడ్డూలు కేవలం స్వీట్లగానే కాకుండా డ్రైఫ్రూట్ లడ్డూలు మంచి పోషక విలువలను కలిగి ఉంటాయి.  Step 2 ఇవి తయారుచేయాలంటే ముందుగా మంచి క్వాలిటీ జీడిపప్పు , బాదంపప్పు, పిస్తాపప్పులను తీసుకోవాలి.  Step 3 ఇలా తీసుకున్న జీడిపప్పు , బాదంపప్పు, పిస్తాపప్పులను చిన్న ముక్కలుగా చేసుకువాలి.  Step 4 మరోపక్క ఒక బాణలిలో నెయ్యి వేడి చేసి ఈ పప్పులను దోరగా వేయించుకోవాలి. వాటిని పక్కన పెట్టుకొని గసగసాల్ని కూడా  దోరగా వేయించుకోవాలి.  Step 5 ఇప్పుడు ఒక గిన్నెలో ఒక పావు లీటరు నీళ్ళు తీసుకుని పొయ్యి మీద పెట్టి  మరిగించాలి. నీళ్ళు మరుగుతున్నప్పుడు 100 గ్రాముల పంచదార కలిపి నీళ్ళ పాకం పట్టాలి.  Step 6 ఇప్పుడు ఆ పాకంలో పావుకిలో ఖర్జూరాలు  కలిపి అవి మెత్తగా అయ్యేదాకా ఉంచాలి.  తర్వాత యాలకుల పొడి సువాసన కోసం కలుపుకోవాలి.  Step 7 ఈ మిశ్రమంలో ఇంతకు ముందు వేయించి పెట్టుకున్న పప్పుల్ని, గసగసాల్ని కలుపుకోవాలి. తరువాత ఆ మిశ్రమాన్ని  చిన్నచిన్న ఉండలుగా చుట్టుకోవాలి. అంతే డ్రై ఫ్రూట్స్ లడ్డూలు తినడానికి రెడీ.
Yummy Food Recipes
Add