Fish Amritsari Recipe cooking tips By , 2015-01-03 Fish Amritsari Recipe cooking tips Fish Amritsari Recipe cooking tips : the cooking tips to make fish amritsari recipe which is spicy seafood recipe. Prep Time: 30min Cook time: 30min Ingredients: అర కేజీ ముళ్లులేని చేపలు, ఒకటి కోడిగుడ్డు, అరకప్పు పెరుగు, ఒక టీ స్పూన్ వాము, తగినంత నూనె, ఒక టీ స్పూన్ మసాలా, ఆరు నిమ్మకాయలు, అరకప్పు వెనిగర్, ఒక కప్పు శెనగపిండి, తగినంత ఉప్పు, ఒక టీ స్పూన్ నిమ్మరసం, ఒక టీ స్పూన్ కారంపొడి, 2 టీ స్పూన్స్ అల్లంవెల్లుల్లి పేస్ట్, ఒక కప్పు టమోటా గ్రేవీ, Instructions: Step 1 చేపలను శుభ్రంగా కడిగేసుకున్న తరువాత వాటిని చిన్న ముక్కలుగా తగిన సైజులో కోసుకోవాలి. వాటిని వెనిగర్’లో 20 నిముషాలపాటు నానబెట్టుకోవాలి. అనంతరం బయటకు తీసి ఆరబెట్టుకోవాలి. Step 2 ఒక గిన్నె తీసుకుని అందులో పెరుగు, గుడ్డు, వాము, ఉప్పు, నిమ్మరసం, కారంపొడి, అల్లం, వెల్లుల్లి పేస్ట్’లను బాగా మిక్స్ చేస్తూ కలియబెట్టుకోవాలి. ఈ మసాలాలో చేపముక్కలను వేసి బాగా కలుపుకుని 20 నిముషాలపాటు నానబెట్టాలి. Step 3 ఒక బాణలి తీసుకుని అందులో కొద్దిగా నూనె పోసి వేడి చేయాలి. నూనె బాగా కాగిన తర్వాత అందులో చేప ముక్కల్ని వేసి బ్రౌన్ కలర్’లోకి వచ్చేంతవరకు ఫ్రై చేసుకొని తీసేయాలి. Step 4 మరో పాత్రలో తగినంత నూనె తీసుకుని మరిగించి, అందులో ఉల్లిపాయ ముక్కల్ని వేసి వేయించాలి. ఆపై టమోటా గ్రేవీ కూడా అందులో వేసి కలియబెడుతూ ఉడికించాలి. Step 5 కొద్దిసేపటి తరువాత ఉడుకుతున్న టమోటా గ్రేవీ మిశ్రమంలో ఇదివరకు ఉడికించి పక్కన పెట్టుకున్న వేడివేడి చేపముక్కల్ని కాసేపు వుంచి తీసేయాలి. అంతే! ఫిష్ అమృతసరీ రిసిపీ రెడీ!
Yummy Food Recipes
Add