green chilli chicken recipe cooking tips By , 2015-01-02 green chilli chicken recipe cooking tips green chilli chicken recipe cooking tips : the cooking tips to make green chilli chicken in home. Prep Time: 30min Cook time: 30min Ingredients: 1 కేజీ చికెన్, 1 కప్ పచ్చిమిర్చి, 2-3 ఉల్లిపాయలు (సన్నగా తరగాలి), 10-12 వెల్లుల్లి రెబ్బలు, 1 ముక్క (మీడియం) అల్లం, 1/2 కప్ తాజా కొత్తిమీర (సన్నగా తరగాలి), రుచికి తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ పసుపు పొడి, 2 టీ స్పూన్ ధనియాలపొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ గరంమసాలా పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర, 3 టీ స్పూన్ నూనె, Instructions: Step 1 ఒక మిక్సీ జార్’లో ఉల్లిపాయలు, వెల్లుల్లి, కొత్తిమీర, పచ్చిమిర్చి, కొద్దిగా ఉప్పుతోబాటు కాస్త నీళ్లు వేసి.. మెత్తని పేస్టులా రుబ్బుకోవాలి. తర్వాత ఈ పేస్టును శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలను పట్టించి, ఒక గంటపాటు పక్కన పెట్టుకోవాలి. Step 2 ఒక పాన్ తీసుకుని అందులో కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి. నూనె కాగిన తర్వాత అందులో జీలకర్ర వేసి ఒక నిముషంపాటు వేయించాలి. తర్వాత అందులోనే పచ్చిమిర్చి, ఉప్పు వేసి వేడి చేయాలి. Step 3 పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత అందులో ఇదివరకు మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలను వేసి.. మీడియం మంట మీద 10 నిముషాలపాటు ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులో ధనియాలపొడి, రోస్ట్ చేసిన జీలకర్రపొడి, పసుపు, గరంమసాలా వేసి మిక్స్ చేస్తూ మరో 5 నిముషాలవరకు ఫ్రై చేయాలి. Step 4 ఇప్పుడు ఉడుకుతున్న చికెన్ పాన్’కు మూతపెట్టేసి.. 15 నిముషాల వరకు ముక్కలు మెత్తబడే వరకూ మీడియం మంటమీద ఉడికించుకోవాలి. గ్రీవీ చిక్కబడి చికెన్ మెత్తగా ఉడికిన తర్వాత మూత తీసి కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసి స్టౌవ్ ఆఫ్ చేయాలి. అంతే!
Yummy Food Recipes
Add