coconut samosa recipe cooking tips By , 2014-12-29 coconut samosa recipe cooking tips coconut samosa recipe cooking tips : the cooking tips to make coconut samosa recipes which is best for health Prep Time: 40min Cook time: 30min Ingredients: 4 కప్పులు మైదాపిండి, 4 టీ స్పూన్లు నెయ్యి, 2 టీ స్పూన్లు వాము, తగినంత ఉప్పు, నూనె, 1 కప్పు కొబ్బరితురుము, 1 కప్పు నువ్వులు, 2 టీ స్పూన్లు కారం, 2 టీ స్పూన్లు ధనియాలపొడి, 2 టీ స్పూన్లు సొంపు, 1/2 టీ స్పూన్ ఇంగుల, Instructions: Step 1 ఒక పాత్రలో మైదాపిండి తీసుకుని అందులో తగినంత వాము, ఉప్పు కలిసి.. చపాతి పిండిలా కలుపుకోవాలి. అలా కలిపిన పిండిని అరగంటపాటు నానబెట్టాలి. Step 2 ఒక బాణలి తీసుకుని అందులో కొద్దిగా నెయ్యి వేసి వేడి చేయాలి. వేడయ్యాక అందులో కొబ్బరి తురుము, నువ్వులను విడివిగా వేయించి.. పక్కనపెట్టుకోవాలి. నువ్వులు చల్లారిన తర్వాత పొడి చేసుకుని ఉంచుకోవాలి. Step 3 ఇప్పుడు ఒక పాత్ర తీసుకుని అందులో కొద్దికొద్దిగా నువ్వులపొడి, కొబ్బరి తురుము, సోంపు, వాము, ధనియాలపొడి, ఇంగువ, కారంపొడిలను బాగా కలుపుకోవాలి. Step 4 మరోవైపు ఇదివరకు చపాతి పిండిలా కలుపుకుని పక్కన పెట్టుకున్న మైదాపిండిని తీసుకుని.. చిన్నచిన్న పూరీల్లా చేసి.. చాకుతో రెండు భాగాలుగా కోయాలి. Step 5 ఇలా భాగాలుగా చేసిన అనంతరం ఒక్కోదాంట్లో ఇదివరకు కలుపుకున్న సుగంధద్రవ్యాల మిశ్రమాన్ని 3 టీ స్పూన్లు వేసి.. నీటితో తడుపుతూ చివర్లలో సమోసా షేప్’లో మూసివేయాలి. ఇలా మొత్తం పిండి అయిపోయేంతవరకు చేయాలి. Step 6 ఇప్పుడు ఒక బాణలి తీసుకుని అందులో కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి. వేడయ్యాక అందులో తయారుచేసుకున్న సమోసాలను వేసి బంగారు వర్ణం వచ్చేదాకా వేయించాలి. అంతే! వేడివేడి కొబ్బరి సమోసాలు రెడీ!
Yummy Food Recipes
Add