methi khichdi By , 2018-05-20 methi khichdi Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty methi khichdi making in best way. Prep Time: 15min Cook time: 55min Ingredients: బియ్యం 4 కప్పులు,పెసరపప్పు 3 కప్పులు,ఉల్లిపాయలు 2 (పెద్దవి),కరివేపాకు 2 రెబ్బలు,గరం మసాలా 5 గ్రాములు,పచ్చిమిరపకాయలు 6,మెంతికూర 2 పిడికిళ్ళు,కారం తగినంత,నూనె తగినంత,పోపు సామాగ్రి 1 స్పూను,క్యారెట్ దుంపలు 6,బంగాళాదుంపలు 2 (పెద్దవి),వెన్న తగినంత,ఉప్పు తగినంత, Instructions: Step 1 ముందుగా బియ్యం, పెసరపప్పులను శుభ్రంగా కడిగి నీళ్ళలో నానబెట్టుకోవాలి. Step 2 తరువాత బంగాళాదుంపల్ని చెక్కు తీసి ముక్కలుగా కోసుకోవాలి. తరువాత క్యారెట్, పచ్చిమిరపకాయల్ని శుభ్రంగా కడిగి విడివిడిగా సన్నగా తరగాలి. Step 3 అలాగే ఉల్లిపాయల్ని సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. మెంతికూరను తరిగి సిద్ధంగా వుంచుకోవాలి. Step 4 తరువాత కుక్కర్లో నూనె పోసి స్టౌ మీద వుంచాలి. నూనె కాగిన తరువాత అందులో ముందుగా పోపు సామాగ్రిని వేసి వేయించాలి. Step 5 తరువాత కరివేపాకు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కల్ని వేసి వేయించాలి. Step 6 తరువాత ఇందులో క్యారెట్ దుంపల ముక్కల్ని, బంగాళా దుంప ముక్కల్ని, మెంతికూరను వేసి గరిటెతో కలపాలి. Step 7 తరువాత ఈ మిశ్రమంలో నీళ్ళలో నానబెట్టిన బియ్యం పెసరపప్పులను నీళ్ళను వార్చి కలపాలి. Step 8 తరువాత తగినంత నీరు పోసి ఎసరు పెట్టాలి. తరువాత ఇందులో కారం, గరంమసాలా, తగినంత ఉప్పులను కలిపి మూత పెట్టి, రెండు విజిల్స్ వచ్చేంత వరకు స్టౌ మీద ఉండికించి, కిందకు దించుకోవాలి Step 9 తర్వాత తగినంత వెన్నను ఉడికించిన మిశ్రమంపై జల్లుకోవాలి. Step 10 దీనితో అద్భుతమైన మెంతి కూర కిచిడీ సిద్ధం.
Yummy Food Recipes
Add