Super Kichdi By , 2018-05-20 Super Kichdi Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty Super Kichdi making in best way. Prep Time: 15min Cook time: 50min Ingredients: సన్నని బియ్యం 4 కప్పులు,పెసరపప్పు 1 కప్పు,నెయ్యి 1 కప్పు,కొబ్బరి తురుము 1 కప్పు,ఉల్లిపాయలు 4,కొత్తిమీర 2 కట్టలు,బంగాళాదుంపలు: 4,పచ్చిమిరపకాయలు 10,అల్లం 1 ముక్క,దాల్చిన చెక్క 1 ముక్క,యాలకులు 6,లవంగాలు 4,లవంగాలు 4,పసుపు 1 టీస్పూన్,జీలకర్ర 2 టీస్పూనులు,ధనియాలు /2టీ స్పూన్,జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్,ఉప్పు తగినంత, Instructions: Step 1 ముందుగా బియ్యం, పెసరపప్పులను ఒక గంటపాటు నీళ్ళలో నానబెట్టాలి Step 2 తరువాత బియ్యం, పెసరపప్పులను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. Step 3 తరువాత ఉల్లిపాయల్ని, అల్లంను, వెల్లుల్లి రేకల్ని, కొత్తిమీరను, పచ్చిమిరపకాయల్ని విడివిడిగా సన్నగా తరగాలి. Step 4 బంగాళాదుంపల చెక్కుతీసి ముక్కలుగా కోసుకోవాలి. తరువాత జీలకర్ర, యాలకులు, లవంగాలు, దాసినచెక్కలను పాడిగా దంచుకోవాలి. Step 5 తరువాత ఒక బాణాలిలో నెయ్యిపోసి, స్టౌ మీద వేడి చేయాలి. ఇందులో ముందుగా ఉల్లిపాయముక్కల్ని వేసి 8 ముకుల్ని, పచ్చిమిరపకాయ ముక్కల్ని, కొద్దిగా వేయించాలి. Step 6 తరువాత అల్లం-వెల్లుల్లి ముక్కల్ని, పచ్చిమిరపకాయ ముక్క, సన్నగా తరిగిన కొబ్బరితురుమును, జీలకర్ర, యాలకులు, లవంగాలు, దాసినచెక్కలను దంచి తయారు చేసుకున్న మసాలాపొడిని వేసి సన్నని మంట మీద వేయించాలి. Step 7 బాణలిలోని మిశ్రమం వేగిన తరువాత అందులో పసుపు, ధనియాలు, జీలకర్రపొడి, బంగాళాదుంప ముక్కలు, తగినంత ఉప్పులను కలపాలి. Step 8  తరువాత బియ్యం, పెసరపప్పులను వేసి తగినంత నీరు పోసి సన్నని మంట మీద మెత్తబడకుండా పదునుగా ఉడికించాలి. Step 9 తరువాత బాణాలిని స్టౌ మీద నుంచి కిందకు దించుకోవాలి. Step 10 దీనితో ఘుమఘుమలాడే సూపర్ కిచిడీ రెడీ. దీనిని వేడివేడిగా బంగాళాదుంపల కుర్మా లేదా కోడి కుర్మాతో వడ్డించాలి.
Yummy Food Recipes
Add