soya paratha recipe making tips healthy breakfast food By , 2014-12-19 soya paratha recipe making tips healthy breakfast food soya paratha recipe making tips healthy breakfast food : the cooking tips to make soya paratha recipe which is healthy breakfast food for everyone. it contains nutrients and other healthy ingredients which prevents diseases Prep Time: 30min Cook time: 20min Ingredients: 2 కప్పులు గోధుమపిండి, అరకప్పు క్యాబేజీ (తురిమి, ఉడికించుకోవాలి), 1-2 బంగాళదుంప (ఉడికించి, చిదిమి పెట్టుకోవాలి), 1 టీ స్పూన్ పచ్చిమిర్చి పేస్ట్, 1/4 కప్పు సోయా (పొడి చేసుకోవాలి), 1 టీ స్పూన్ పచ్చిమిర్చి పేస్ట్, 1/4 కప్పు పెసరపప్పు (ఉడికించుకోవాలి), 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ కొత్తిమీర, 1 కప్పు నీళ్లు, 3 టీ స్పూన్ నూనె, రుచికి తగినంత ఉప్పు, Instructions: Step 1 స్టౌవ్ మీద ఒక పాత్రను పెట్టి, అందులో కాస్త నూనె వేసి వేడి చేయాలి. వేడయ్యాక అందులో జీలకర్ర వేసి ఒక నిముషం వరకు వేగించాలి. తర్వాత అందులో ముందుగా ఉడికించి పెట్టుకున్న క్యాబేజ్ తురుము, పెసరపప్పు వేసి.. మీడియం మంట మీద 5 నిముషాలపాటు వేయించాలి. Step 2 అలా క్యాబేజ్ మిశ్రమాన్ని వేడి చేసిన అనంతరం అందులోనే సోయా పొడి, చిదిమి పెట్టుకున్న బంగాళదుంప వేసి మరో 5 నిముషాలపాటు ఉడికించుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి పేస్ట్, పసుపు, ఉప్పు, కొత్తిమీర వేసి బాగా వేగించుకోవాలి. అలా ఉడికించిన తర్వాత స్టౌ ఆఫ్ చేసి, అరగంటపాటు చల్లారనివ్వాలి. Step 3 మరోవైపు ఒక బౌల్ తీసుకుని అందులో గోధుమపిండి, తగినంత ఉప్పు, నీళ్లు పోసి చపాతి పిండిలాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న అనంతరం ఆ పిండిలో నుంచి కొద్దికొద్దిగా పిండి తీసుకుని.. చపాతీ కర్రతో చపాతీలాగే రౌండ్’గా రుద్దుకోవాలి. Step 4 అలా చపాతీలా గుండ్రంగా చేసిన తర్వాత దాని మధ్యలో ఇదివరకు ఫ్రై చేసి పెట్టుకున్నక్యాబేజ్ వేసి.. ఆ చపాతీని అన్నివైపులా మూసుకుపోయేవిధంగా మడుచుకోవాలి. అలా మడిచిన అనంతరం తిరిగి దానిని చపాతీలాగే ఫ్లాట్’గా రుద్దుకోవాలి. Step 5 స్టౌవ్ మీద ఒక తవా పెట్టి దానిని వేడి చేసుకోవాలి. ఆ తవా వేడైన తర్వాత దానిమీద ఇదివరకు స్టఫ్ చేసిన పరోటాను వేసి, రెండువైపులా వేడిచేయాలి. ఆ చపాతీ గోల్డ్ బ్రౌన్ కలర్’లోకి మారేంతవరకు వేడిచేసిన అనంతరం తీసేయాలి. అంతే! హెల్తీ సోయా పరోటా రెడీ!
Yummy Food Recipes
Add