spicy chicken tomato curry recipe making tips healthy food item By , 2014-12-18 spicy chicken tomato curry recipe making tips healthy food item spicy chicken tomato curry recipe making tips healthy food item : the making of spicy chicken tomato curry which contains nutrients and anti accidents. These ingredients prevents normal diseases Prep Time: 30min Cook time: 40min Ingredients: 500 గ్రాములు (2 కప్స్) చికెన్, 2 కప్పులు టమోటా గుజ్జు, 2 టీ స్పూన్లు చింతపండు గుజ్జు, ఒక కప్పు బంగాళదుంపలు, అరకప్పు ఉల్లిపాయలు, పావు కప్పు వెల్లుల్లి రెబ్బలు, 2 టీ స్పూన్లు రెడ్ చిల్లీ పేస్ట్, కొద్దిగా కొత్తిమీర తరుగు, కొద్దిగా కరివేపాకు, 1 టీ స్పూన్ జీలకర్రపొడి, 1 టీ స్పూన్ కొబ్బరి నూనె, రుచికి తగినంత ఉప్పు, Instructions: Step 1 చికెన్ ముక్కలను నీటిలో శుభ్రంగా కడిగిన తరువాత వాటిని పసుపు, ఉప్పుతో మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. Step 2 ఒక పాన్ తీసుకుని అందులో తగినంత కొబ్బరినూనె వేసి వేడి చేసుకోవాలి. వేడయ్యాక అందులో కరివేపాకు వేసి ఫ్రై చేయాలి. Step 3 ఫ్రై చేసిన వెంటనే అందులో వెల్లుల్లి రెబ్బలు వేసి, 10 సెకనుల తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి.. అవి బ్రౌన్ కలర్’లోకి వచ్చేంతవరకు ఉడికించుకోవాలి. Step 4 అలా కలర్ మారిన తర్వాత అందులో జీలకర్రపొడి, ఉప్పు వేసి నిముషంవరకు వేయించాలి. అనంతరం టమోటా పేస్ట్ వేసి.. మొత్తం మిశ్రమాన్ని కలియబెడుతూ 10 నిముషాలవరకు వేడిచేయాలి. Step 5 అలా వేడి చేసిన తరువాత అందులోనే రెడ్ చిల్లీ పేస్ట్ వేసి మరో 5 నిముషాలవరకు ఉడికించాలి. టమోటా గ్రేవీ చిక్కగా అయ్యేంతవరకు వేయించాలి. Step 6 టమోటా గ్రేవీ చిక్కగా అయిన అనంతరం అందులో ఇదివరకు మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ ముక్కలను వేసి.. మూతపెట్టి వేడిచేయాలి. Step 7 కొద్దిసేపటి తర్వాత మంటను పూర్తిగా తగ్గించి.. అంటే మీడియం మంట మీద ఉడికించుకోవాలి. అలా చేస్తే మసాలాలు చికెన్ ముక్కలకు బాగా పడుతాయి. Step 8 చివరగా ఉడుకుతున్న ఆ చికెన్-టమోటా గ్రేవీలో కొద్దిగా చింతపండు గుజ్జును వేసి.. నిముషం తర్వాత స్టౌవ్ ఆఫ్ చేయాలి. అంతే! చికెన్ టమోటా కర్రీ రెడీ! దీనిని కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవచ్చు.
Yummy Food Recipes
Add