badam ka halwa sweet recipe making By , 2014-12-11 badam ka halwa sweet recipe making badam ka halwa recipe, healthy sweet food recipes tips, cooking tips Prep Time: 20min Cook time: 25min Ingredients: 1/2 కప్ బాదం (రాత్రంతా నానబెట్టి గ్రైండ్ చేయాలి), 1/2 లేదా రుచికి సరిపడా పంచదార, 1 కప్ పాలు, 1/2 కప్ నెయ్యి, కొద్దిగా కుంకుమ పువ్వు (పాలలో నానబెట్టుకోవాలి), Instructions: Step 1 ఒక డీప్ బాటమ్ పాత్రను తీసుకుని అందులో కొద్దిగా నెయ్యి వేసి దానిని ఆ పాత్రలో మొత్తం స్ర్పెడ్ చేయాలి. (హల్వా పాన్’కు అంటుకోకుండా వుండేందుకు ఇలా చేయాలి). తర్వాత అందులో కొద్దిగా నీళ్లు పోసి వేడి చేయాలి. అనంతరం స్టౌవ్ ఆఫ్ చేసి అందులో పంచదార వేసి, కరిగేవరకు కలియబెట్టాలి. Step 2 అలా పంచదారకు కరిగించిన తర్వాత అందులోనే బాదం పేస్ట్, పాలు, కుంకుమపువ్వు వేసి, మీడియం మంట మీద ఉడికించాలి. మొత్తం మిశ్రమాన్ని ఎప్పటికప్పుడు కలియబెడుతూనే వుండాలి. లేకపోతే మిశ్రమం పాత్రకు అడుగుభాగాన అంటుకోవచ్చు. Step 3 ఇలా ఉడకబెడుతున్నప్పుడు పాత్రకు చివరిభాగంలో డ్రై అవుతున్నట్లు కనిపిస్తుంది. అప్పుడు అందులో ఇంకా నెయ్యి పోసి, మరో 10 నిముషాలవరకు వేగించాలి. కొద్దిసేపటి తర్వాత నెయ్యిని పూర్తిగా హల్వా గ్రహిస్తుంది. అప్పుడు స్టౌవ్ ఆఫ్ చేసేయాలి. కొద్దిసేపటి వరకు చల్లారిస్తే చాలు.. బాదం హల్వా రెడీ!
Yummy Food Recipes
Add
Recipe of the Day