manchurian chicken recipe making By , 2014-12-11 manchurian chicken recipe making manchurian chicken recipe making : manchurian chicken recipe is a chinese food which is very spicy, tasty and healthier. Normally it is available in hotels and restuarants. But here are some tips to make this dish at home. Read for more... Prep Time: 30min Cook time: 20min Ingredients: 1/2 కేజీ చికెన్ (ముక్కలు లేనివి), 1 కప్ కార్న్, 2 గుడ్లు (బీట్ చేసి పెట్టుకోవాలి), 4 వెల్లుల్లి రెబ్బలు (తరిగినవి), 6 - 8 పచ్చిమిర్చి, 3 టేబుల్ స్పూన్స్ సోయాసాస్, 2 - 3 టేబుల్ స్పూన్స్ టమోటా సాస్, 1 టేబుల్ స్పూన్ అల్లంవెల్లిల్లి పేస్ట్, 1 - 2 క్యాప్సికమ్, 1 అంగుళం అల్లం, 2 టేబుల్ స్పూన్స్ కొత్తిమీర తరుగు, 1/2 టీ స్పూన్స్ అజినోమోటో, 1 కప్ నూనె, రుచికి సరిపడా ఉప్పు, Instructions: Step 1 ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో కార్న్’ఫ్లోర్, గుడ్డు, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిలు, ఉప్పు, అల్లంవెల్లుల్లి పేస్ట్ తదితర పదార్థాలను వేసి.. మొత్తం మిశ్రమాన్ని బాగా కలియబెట్టాలి. అందులోనే గోరువెచ్చని నీళ్లు పోసి మిక్స్ చేయాలి. Step 2 ఈ మసాలా మిశ్రమంలో ఇదివరకే కట్ చేసిన ఎముకలు లేని చికెన్ ముక్కలను వేసి బాగా కలుపుకోవాలి. చికెన్ ముక్కలకు అన్నివైపులా ఆ మసాలా తగిలేలా చూసుకోవాలి. Step 3 ఒక డీప్ బాటమ్ పాత్రను తీసుకుని అందులో కాస్త నూనె పోసి వేడి చేసుకోవాలి. కాగిన తర్వాత అందులో ఇదివరకే మసాలాతో మిక్స్ చేసిన చికెన్ ముక్కలను అందులో వేసి మీడియం మంట మీద డీప్ ఫ్రై చేయాలి. ముక్కలు బ్రౌన్ కలర్’లో వచ్చేవరకూ అలాగే చేయాలి. Step 4 మరొక పాన్ తీసుకుని అందులో కాస్త నూనె పోసి వేడి చేయాలి. వేడయ్యాక అందులో అల్లం, వెల్లుల్లి వేయాలి. తర్వాత పచ్చిమిర్చి వేసి రెండు నిముషాలపాటు వేడి చేయాలి. అనంతరం అందులోనే సోయాసాస్, టమోటా సాస్, అజినామోటో తదితర పదార్థాలు వేసి కొద్దిసేపటి వరకు వేగించాలి. బాగా కాగిన తర్వాత అందులోనే కొత్తిమీర తరుగు మిక్స్ చేసి, అరకప్పు నీళ్లు పోయాలి. Step 5 అలా చేసిన తరువాత ఆ మిశ్రమంలో ఇదివరకు ఫ్రై చేసుకున్న చికెన్ ముక్కలను వేసి బాగా మిక్స్ చేయాలి. మీడియం మంట మీద మొత్తం మిశ్రమాన్ని ఉడికించాలి. అంతే.. హాట్ హాట్, స్పైసీ చికెన్ మంచూరియా రెడీ!
Yummy Food Recipes
Add