tomato stuffed recipe indian style best vegetarian food By , 2014-12-08 tomato stuffed recipe indian style best vegetarian food tomato stuffed recipe indian style best vegetarian food : tomato stuffed is the best and tastiest vegetarian recipe than other. It is simple to make in the spcial occasions Prep Time: 30min Cook time: 20min Ingredients: 2 లేదా 3 ఎర్రగా వుండే టొమాటోలు, 1 లేదా 2 టేబుల్ స్పూన్స్ ఆలివ్ ఆయిల్, 3 టేబుల్ స్పూన్స్ నువ్వు పప్పు, 2 టేబుల్ స్పూన్స్ ఫైన్ నట్స్, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్స్ వెనిగర్, 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్స్ మిరియాలపొడి, 1/2 కప్పు ఉల్లి తరుగు, 2 వెల్లుల్లి రేకలు, 1/2 కప్పు వంకాయ ముక్కలు, 1/2 కప్పు టొమాటో ముక్కలు, 5 పుదీనా ఆకులు, 1 కప్పు కొత్తిమీర తరుగు, సరిపడా ఉప్పు, Instructions: Step 1 మైక్రోవేవ్ ఓవెన్’ను 350 డిగ్రీల వద్ద వేడి చేయాలి. అది వేడి అవుతుండగానే టొమాటోలను నీటిలో బాగా శుభ్రం చేసుకుని, వాటి పైభాగాన్ని కట్ చేసుకోవాలి. లోపల వుండే గుజ్జును స్పూన్’తో జాగ్రత్తగా తీయాలి. Step 2 ఒక పాన్ తీసుకుని అందులో తగినంత ఆలివ్ ఆయిల్ వేసి, బాగా ఉడికించుకోవాలి. అది కాగిన అనంతరం వెల్లుల్లిరేకులు, ఉల్లి తరుగు, జీలకర్ర తదితర పదార్థాలు వేసి మరో 5 నిముషాలవరకు వేడి చేయాలి. తర్వాత వంకాయ ముక్కలను అందులో జతచేసి కొద్దిసేపటి వరకు ఉడికించాలి. Step 3 ఒక చిన్న బాణలి తీసుకొని అందులో వెనిగర్, టొమాటో ముక్కలను వేసి బాగా వేయించాలి. అలా వేడిచేస్తుండగానే అందులో పుదీనా ఆకులు, కారం, జత చేసి కొద్దిసేపటి వరకు వేడి చేయాలి. తర్వాత స్టౌవ్ మీద నుంచి కిందకు దించేసి, కొద్దిసేపటివరకు చల్లార్చాలి. చల్లారిన అనంతరం ఆ మిశ్రమాన్ని మిక్సీలో వేసి మెత్తగా పేస్టులా చేసుకోవాలి. Step 4 మరొక బాణలి తీసుకుని అందులో కూరగాయ ముక్కలను, నువ్వుపప్పు, ఫైన్ నట్స్ తదితర పదార్థాలు వేసి.. వేయించాలి. వేడిగా వుండగానే మిరియాలపొడి, ఉప్పు వేసి కొద్దిసేపటివరకు వేడి చేయాలి. అనంతరం స్టౌవ్ మీద దించేయాలి. Step 5 ఇలా ఈ విధంగా తయారుచేసుకున్న అన్ని మిశ్రమాలను ఒకే గిన్నెలో వేసి బాగా కలుపుకోవాలి. Step 6 ఆ విధంగా మిశ్రమాన్ని కలుపుకున్న అనంతరం దానిని టొమాటోలలో స్టఫ్ (కూరడం) చేయాలి. Step 7 అలా స్టఫ్ చేసిన తర్వాత బేకింగ్ షీట్ మీద వుంచి ఓవెన్’లో 20 నిముషాలు బేక్ చేయాలి. అనంతరం బయటకు తీసి, కొత్తిమీరతో గార్నిష్ చేయాలి. Step 8 అంతే.. ఈ విధంగా తయారుచేసుకున్న ఈ టొమాటో స్టఫ్ట్’ను సర్వ్ చేసుకుని తింటే ఎంతో రుచిగా అనిపిస్తుంది.
Yummy Food Recipes
Add