ladies finger fry bendakaya gutti kura rice chapati best combination By , 2014-12-08 ladies finger fry bendakaya gutti kura rice chapati best combination ladies finger fry bendakaya gutti kura rice chapati best combination : this is a special food which is best combo for rice and chapati. It's taste is very different than other okra recipes. Prep Time: 30min Cook time: 25min Ingredients: 1/2 కేజీ బెండకాయలు, 1 కప్ శెనగలు, 1 టేబుల్ స్పూన్ నువ్వులు (వేయించాలి), 2 టేబుల్ స్పూన్స్ పల్లీలు (వేయించాలి), 1 కప్ సెనగలు (వీటికి బాగా ఉడికించిన తర్వాత మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్’లా చేయాలి), 1 టేబుల్ స్పూన్ అవిసె గింజలు (వేయించాలి), 2 టేబుల్ స్పూన్స్ పచ్చిమిర్చి ముద్ద, 2 టేబుల్ స్పూన్స్ అల్లంవెల్లుల్లి ముద్ద, 1/4 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్స్ నిమ్మరసం, గుప్పెడు కొత్తిమీర, సరిపడా ఉప్పు, తగినంత నూనె, Instructions: Step 1 ముందుగానే వేయించుకున్న అవిసె గింజలు, నువ్వులు, పల్లీలను విడివిడిగా మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి. వీటిని కొద్దిసేపటి వరకు పక్కన పెట్టుకోవాలి. Step 2 మరొక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో ముందుగానే సిద్ధంచేసుకున్న సెనగల ముద్ద, అల్లంవెల్లుల్లి ముద్ద, పచ్చిమిర్చి ముద్దం, పసుపు, నిమ్మరసం, కొత్తిమీర, ఉప్పు తదితర పదార్థాలు వేసి.. అన్ని బాగా కలిసేలా కలియబెట్టాలి. Step 3 ఇక బెండకాయలను నీటిలో వేసి శుభ్రంగా కడుక్కోవాలి. తడి ఆరిపోయిన అనంతరం రెండువైపులా నుంచి తొడిమలు తీసేసి, మధ్యకు గాడి పెట్టాలి. (బెండకాయలు ముక్కలు కాకుండా జాగ్రత్తగా చూసుకోవాలి.) Step 4 ముందుగానే మిక్సింగ్ బౌల్’లో తయారుచేసుకున్న స్టఫింగ్ మిశ్రమాన్ని బెండకాయల్లో జాగ్రత్తగా కూరుకోని పక్కన పెట్టుకోవాలి. Step 5 మరోవైపు ఒక ఫ్రైయింగ్ పాన్’ను తీసుకుని అందులో నూనె వేసి బాగా కాగాలి. బాగా వేడెక్కిన అనంతరం అందులో ఒక్కొక్కటిగా తీసిపెట్టుకున్న బెండకాయలను వేసి.. బాగా కలిపి ఒక మూత పెట్టి పదినిముషాల వరకు వుంచాలి. Step 6 బాగా ఉడికిన అనంతరం అందులో పల్లీలు, నువ్వులు, అవిసె గింజల పొడుల మిశ్రమాన్ని వేసి బాగా కలుపుకోవాలి. కొద్దిసేపటి తర్వాత దించేయాలి. Step 7 అంతే.. ఈ విధంగా బెండకాయ గుత్తికూరను తయారుచేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. తయారుచేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా వ్యవహరిస్తే మంచిది.
Yummy Food Recipes
Add