chicken kadai recipe cooking tips By , 2015-01-02 chicken kadai recipe cooking tips chicken kadai recipe cooking tips : the cooking tips to make chicken kadai recipe. It taste different when added some cloves to this recipe. Prep Time: 30min Cook time: 45min Ingredients: ఒకటిన్నర కేజీ చికెన్, 1 కేజీ ఉల్లిపాయలు, 1/2 కేజీ టమోటాలు, 300 గ్రాములు నెయ్యి, 20 గ్రాములు కారం, 8-10 పచ్చిమిర్చి, 4-6 లవంగాలు, 15-20 కరివేపాకు, 1 కట్ట కొత్తిమీర, 2 టీ స్పూన్స్ అల్లంవెల్లుల్లి పేస్ట్, తగినంత ఉప్పు, Instructions: Step 1 ఒక పాన్ తీసుకుని అందులో కొద్దిగా నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి కాగిన తర్వాత అందులో మెత్తగా నూరిన ఉల్లిపాయల ముద్దను వేసి, 10 నిముషాలవరకు దోరగా వేయించుకోవాలి. Step 2 అనంతరం అందులోనే టమోటా ముక్కలు, కారం, పచ్చిమిర్చి, తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. అలాగే తగిన మోతాదులో లవంగాలను చితకకొట్టి ఆ మిశ్రమంలో కలియబెట్టుకోవాలి. అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేయించుకోవాలి. Step 3 ఆ మొత్తం మిశ్రమాన్ని బాగా వేయించిన అనంతరం అందులో చికెన్ ముక్కల్ని వేసి కలియబెడుతూ ఉడికించుకోవాలి. కూర సగం ఉడికిన తర్వాత కరివేపాకు, కొత్తిమీర చల్లి పాత్రకు మూతపెట్టేసి.. మీడియం మంటమీద వేయించాలి. అంతే!
Yummy Food Recipes
Add
Recipe of the Day