palak chicken fry recipe making By , 2014-12-09 palak chicken fry recipe making palak chicken fry recipe making : The making of palak chicken recipe which has contains healthy ingredients. Prep Time: 30min Cook time: 20min Ingredients: 1/2 కేజీలు చికెన్, 150 గ్రాములు పాలకూర, 4 ఉల్లిపాయలు, 8 ఎండుమిర్చి, 7 పచ్చిమిర్చి, 2 టేబుల్ స్పూన్స్ అల్లంవెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా (దాల్చిన చెక్క - చిన్నముక్క; లవంగాలు - 5; ఏలకులు - 3 కలిపి పొడి చేయాలి), 5 రెమ్మలు పుదీనా, 2 రెమ్మలు కరివేపాకు, 2 టేబుల్ స్పూన్ కొత్తిమీర తరుగు, 10 - 13 జీడిపప్పు, సరిపడా ఉప్పు, Instructions: Step 1 చికెన్’ను ముందుగా నీటిలో శుభ్రంగా కడిచేసుకుని.. మీడియం సైజ్’లో కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత మరోసారి నీటిలో కడిగి, పక్కన పెట్టుకోవాలి. Step 2 మరోవైపు ఉల్లిపాయలను, పచ్చిమిర్చిని తగిన పరిమాణంలో సన్నగా తరగాలి. Step 3 ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ ముక్కలకు పసుపు, మసాలా పట్టించి.. స్టౌ మీద కాసేపు ఉడికించుకోవాలి. 10 నిముషాలు వేడెక్కిన తర్వాత నీళ్లుపోసి.. మరో 10 నిముషాలవరకు వేగించాలి. Step 4 మరొక స్టౌవ్ మీద ఒక గిన్నెను పెట్టి.. అందులో నూనె పోసి కొద్దిసేపు వేడి చేయాలి. బాగా కాగిన అనంతరం అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లంవెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, పుదీనా, పాలకూర తదితర పదార్థాలు, రుచికి సరిపడా ఉప్పు వేసి వేగించాలి. Step 5 ఆ మిశ్రమం బాగా వేడెక్కిన తర్వాత అందులో ఇదివరకే ఉడికించిన చికెన్ ముక్కలను వేసి.. బాగా వేగించాలి. Step 6 చికెన్ బాగా ఉడికిన తర్వాత దించేముందు ధనియాలపొడి, జీడిపప్పు, కొత్తమీర తదితర పదార్థాలు చల్లాలి. అలా చల్లిన తర్వాత మరో ఐదునిముషాలపాటు మూతపెట్టి వుంచాలి. Step 7 అంతే.. మూత తెరిస్తే ఘుమఘుమల సువాసన కలిగిన పాలక్ చికెన్ ఫ్రై రెడీ.
Yummy Food Recipes
Add