pepper chicken By , 2018-01-13 pepper chicken Here is the process for pepper chicken making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 25min Ingredients: చికెన్ - అరకిలో (బోన్ లేదా బోన్ లెస్ అనేది మీ ఇష్టం),,ఉల్లిపాయల తరుగు - ఒక టేబుల్ స్పూను,,మిరియాల పొడి - ఒక టీస్పూను,,మిరియాలు - ఒకటిన్నర టీ స్పూను,పసుపు - పావు టీ స్పూను,,నిమ్మరసం - ఒక టీస్పూను,,ఉప్పు - తగినంత,,అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక టీస్పూను,,వెల్లుల్లి పాయలు - రెండు రెబ్బలు,,పచ్చి మిరపకాయలు - నాలుగు,,కరివేపాకు - రెండు రెబ్బలు,,గరం మసాలా - అర టీస్పూను,, Instructions: Step 1 చికెన్ బోన్ తో లేదా బోన్ లెస్ ఎలాగైనా పెప్పర్ చికెన్ కు వాడొచ్చు.  Step 2 ముందు చికెన్ ముక్కలు శుభ్రంగా కడిగి, వాటికి ఉప్పు, పసుపు, మిరియాలపొడి, నిమ్మరసం పట్టించి అరగంటపాటూ పక్కన పెట్టాలి.  Step 3 ఈలోపు మిరియాలను మరీ పొడిలా కాకుండా రవ్వలా దంచి పక్కన పెట్టుకోవాలి.  Step 4 ఇప్పుడు కళాయిలో నూనె వేసి వేడెక్కాకా ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి వేయించాలి.   Step 5 అందులో అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించాలి.    Step 6 తరువాత గరంమసాలా పొడి, దంచిన మిరియాలు వేసి బాగా కలపాలి.    Step 7 ఆ మిశ్రమంగా బాగా వేగాక మారినేషన్ చేసిన చికెన్ ముక్కల్ని వేసి కలపాలి.    Step 8 ఓ 20 నిమిషాల పాటూ బాగా ఉడికించాలి. నీళ్లన్నీ ఆవిరయ్యాక ఒక స్పూను నూనె వేసి చికెన్ ను వేయించాలి. అంతే పెప్పర్ చికెన్ సర్వ్ చేయడానికి సిద్ధంగా ఉంది.          
Yummy Food Recipes
Add