aloo-matar-potato-peas-curry By , 2018-04-10 aloo-matar-potato-peas-curry Here is the process for aloo-matar-potato-peas-curry making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 25min Ingredients: నూనె-2 టేబుల్ స్పూన్లు,జీలకర్ర-1/2 టీ స్పూను,ఉల్లిపాయలు-సన్నగా తరిగినవి 3/4కప్పు,వెల్లుల్లి-సన్నగా తరిగినది ఒక టీస్పూను,అల్లం- సన్నగా తరిగినది ఒక టీస్పూను,పచ్చి కిర్చి పేస్టు-ఒక టీ స్పూను,టమాటాలు-సన్నగా తరిగినవి 1 కప్పు,పచ్చి బఠాణీ-ఉడికించినవి 1 కప్పు,ఆలుగడ్దలు-ఉడికించినవి 1 1/2 కప్పు,ఉప్పు-తగినంత,కారం-1 1/2 టీ స్పూను,గరం మసాల-1/2 టీ స్పూను,పసుపు-చిటికెడు, Instructions: Step 1 ముందుగా ఒక నాన్ స్టిక్ ప్యాన్ తీసుకుని దానిలో నూనె వేసి వేడి చెయ్యాలి.  Step 2 నూనె వేడెక్కాకా దానిలో జీల కర్ర వేసి చిటపటలాడూతుంటే తరిగిన ఉల్లిపాయలు వేసి కలపాలి.  Step 3 ఉల్లిపాయలు లేత గోధుమ రంగులోకి వచ్చే వరకూ కలుపుతుండాలి.  Step 4 ఇప్పుడు ఉల్లిపాయలకి వెల్లుల్లి, అల్లం,టమాటాలు, పచ్చి మిర్చి పేస్టు వేసి ఒక స్పూను నీళ్ళు కలిపితే టమాటాలు బాగా ఉడుకుతాయి.    Step 5 ఇప్పుడు ఉడికిన టమాటాలని బాగా మెత్తగా అయ్యే వరకూ గరిటెతో మెదిపి, మసాలాలన్నీ బాగా ఉడికాకా దానిలో పచ్చి బఠాణీ మరియూ ఆలుగడ్డ కలపాలి.    Step 6 ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా వేసి బాగా కలపాలి.    Step 7 ఇప్పుడు ఒక కప్పు నీళ్ళు పోసి కూరని బాగా ఉడకనివ్వాలి ఉడికేటప్పుడు ఆలు గడ్డలని మెదిపితే కూర చిక్కబడుతుంది.    Step 8 అంతే మీ ఆలూ మటర్ కూర తయారు.స్టవ్ ఆపి ఈ కూరని ఒక బౌల్లోకి తీసుకోవాలి.    Step 9 పైన కొత్తిమీరతో గార్నిష్ చేసి వడ్డించడమే.   Step 10 ఈ కూర ఎంత సులభమో కదా. ఈ కూర ఎంత రుచిగా ఉంటుందంటే మీరు బ్రెడ్‌తో కూడా దీనిని తినచ్చు.కూరగాయలంటే ఆమడ దూరం పారిపోయే పిల్లలు కూడా ఈ కూరని వేడి అన్నం లేదా రోటీలతో తినడానికి ఇష్టపడతారు.  
Yummy Food Recipes
Add
Recipe of the Day