chicken pulao By , 2018-01-13 chicken pulao Here is the process for chicken pulao making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 30min Ingredients: బాస్మతి బియ్యం - రెండు కప్పులు,,చికెన్ ముక్కలు - అరకిలో,,అల్లం వెల్లుల్లి పేస్టు - రెండు టీ స్పూనులు,,ఉల్లిముక్క - ఒకటి (పెద్దది),,యాలకులు - మూడు,,లవంగాలు - మూడు,,పలావు ఆకు - మూడు,,స్టార్ అనిస్ - రెండు,,దాల్చిన చెక్క - ఒకటి, పచ్చి మిరపకాయలు - మూడు,,గరం మసాలా పొడి - ఒక టీస్పూను,,కారం- ఒక టీస్పూను,,పసుపు - ఒక టీ స్పూను,,పెరుగు - రెండు టీ స్పూనులు,,ఉప్పు - సరిపడినంత,,నూనె - సరిపడినంత, Instructions: Step 1 చికెన్ ముక్కల్ని శుభ్రంగా కడిగి నీరు వార్చి ఒక బౌల్ లో ఉంచాలి.  Step 2 బౌల్ లో కారం, గరం మసాలా, పసుపు, ఉప్పు, ఒక టీస్పూను అల్లం వెల్లుల్లి పేస్టు వేసి చికెన్ లో బాగా కలిపి ఒక పక్కన అరగంట పాటూ ఉంచేయాలి. Step 3 అరగంట తరువాత స్టవ్ మీద కళాయి పెట్టి, అందులో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడెక్కాక పలావు ఆకు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, స్టార్ అనిస్ వేసి వేయించాలి.  Step 4 తరువాత నిలువునా కోసిన పచ్చిమిర్చి, ఉల్లి పాయ ముక్కలు వేసి వేయించాలి.    Step 5 ఇవి బాగా వేగాక మారినేట్ చేసిన చికెన్‌ను వేసి బాగా కలపాలి. కాసేపు చికెన్ కుక్ చేయాలి.    Step 6 ఇప్పుడు రెండు కప్పుల పెరుగును వేసి బాగా కలపాలి. చికెన్ ముక్కలు హాఫ్ బాయిల్ అయ్యే దాకా అలా ఉడికించాలి.   Step 7 అనంతరం కడిగిన బియ్యం వేసి కలపాలి. బియ్యం ఉడికేందుకు నాలుగు కప్పుల నీళ్లు వేయాలి.    Step 8 అందులో చిటికెడు పసుపు, ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, సరిపడా ఉప్పు వేసి కలపాలి. అన్నం ఉడికాక దించేముందు ఒకసారి గరిటెతో కలపాలి. అంతే ఘుమఘుమలాడే చికెన్ పులావ్ రెడీ అయిపోయింది.          
Yummy Food Recipes
Add