akyakyabatak curry By , 2016-11-01 akyakyabatak curry Akyakyabatak curry mixed vegetables. Prep Time: 25min Cook time: 25min Ingredients: రెండు పెద్ద పెద్ద ఆలు(బంగాళాదుంపలు),2 క్యారెట్,పావు చెక్క క్యాబేజీ,మూడు టమాటలు,ఒక కప్పు బఠాని ,అంగుళం ముక్క అల్లం,5 పచ్చిమిరపకాయలు,రెండు స్పూన్ల శనగపప్పు ,1 స్పూన్ మినపపప్పు ,అరటీ స్పూన్ ఆవాలు,1 టీస్పూన్ జీలకర్ర,ఐదు ఎండుమిరపకాయలు,పావు టీ స్పూన్ ఇంగువ,పావు టీస్పూన్ పసుపు,ఒక స్పూన్ ఆయిల్,తగినంత ఉప్పు, Instructions: Step 1 ముందుగ కూరలు అన్నిటిని బాగా కడిగి క్యాబేజ్ ను క్యారెట్ ను ఆలు ను సన్నగా తురిముకోవాలి . Step 2 ఇప్పుడు టమాట ,అల్లం ,పచ్చిమిరపకాయలను మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి . Step 3 ఇప్పుడు ఒక బాణి తీసుకుని అందులో నూనె వేసి సెనగపప్పు,మినపపప్పు,ఆవాలు ,జీలకర్ర .,ఎండుమిరప ముక్కలు ,పసుపు,ఇంగువ వేసి పోపును దోరగా వేయించాలి . Step 4 వేగిన పోపులో ఉప్పు వేసి బాగా కలిపి తురిమి పెట్టుకున్న కూరల మిశ్రమం వేసి బఠానీలు వేసి బాగా కలిపి కప్పు నీళ్ళు పోసి ఉడకనివ్వాలి . Step 5 ఉడికిన కూరలో ఇందాక మనం గ్రైండ్ చేసిన టమాట మిశ్రమాన్ని వేసి మాడకుండా గరిట తో కలుపుతూ ఇగరనివ్వలి... Step 5 ఘుమఘుమ లాడే ఆక్యక్యబటక కూర రెడీ ....... ఇక వేడి వేడిగా తినడమే మిగిలింది. అన్నంతోపాటు చపాతీ, ముఖ్యంగా దోసెలోకి ఇది బాగా కుదురుతుంది.
Yummy Food Recipes
Add
Recipe of the Day