coconut payasam By , 2018-03-17 coconut payasam Here is the process for coconut payasam making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 25min Ingredients: సేమియా - కప్పు,,పాలు - అరలీటరు,,చిక్కని కొబ్బరిపాలు - అరకప్పు (పచ్చికొబ్బరి తురిమి గ్రైండ్‌ చేసి వడగట్టిన కొబ్బరి పాలు),,పంచదార - ఒకటిన్నర కప్పు,,నువ్వులు, మినపప్పు, పెసరపప్పు - మూడు టేబుల్‌ స్పూన్లు (అన్నీ కలిపి),జీడిపప్పు పొడి- రెండు టేబుల్‌ స్పూన్లు,,యాలకుల పొడి - టేబుల్‌ స్పూను,,ద్రాక్ష, జీడిపప్పు, బాదం - పావుకప్పు., Instructions: Step 1 పాన్‌లో నువ్వులు, మినపప్పు, పెసరపప్పు విడివిడిగా వేయించాలి. ఈ మూడింటినీ కలిపి మెత్తని పొడిలా చేసుకోవాలి.  Step 2 తర్వాత అదే పాన్‌లో కొద్దిగా నెయ్యి వేసి జీడిపప్పు, ద్రాక్ష, బాదం దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి.  Step 3 అదే పాన్‌లో మరికొద్దిగా నెయ్యి వేసి, సేమ్యాను వేయించి పెట్టుకోవాలి. పాలు కాగాక.. కొబ్బరిపాలనూ చేర్చి... మరోసారి మరగనివ్వాలి.  Step 4 సన్నని మంటపై ఉంచి.. సేమ్యా వేయాలి. కొద్దిసేపటి తర్వాత పంచదార కలపాలి.   Step 5 ఇప్పుడు అరకప్పు పాలు తీసుకుని ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న పొడిని కలిపి ఈ మిశ్రమాన్ని మరుగుతున్న పాలల్లో వేయాలి.    Step 6 పది నిమిషాలయ్యాక జీడిపప్పు, యాలకుల పొడి వేసి కలియబెట్టాలి.    Step 7 నువ్వులు, మినపప్పు, పెసరపప్పు.. రుచితోపాటు.. చిక్కదనాన్ని ఇస్తాయి. చివరగా జీడిపప్పు, ద్రాక్ష, బాదంతో గార్నిష్‌ చేసి సర్వ్‌ చేయడమే.              
Yummy Food Recipes
Add