Vakkaya pappu By , 2017-12-27 Vakkaya pappu Here is the process for Vakkaya pappu making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 25min Ingredients: వాక్కాయలు - పావు కిలో,,కందిపప్పు - 1 కప్పు,,పసుపు - పావు టీ స్పూను,,పచ్చిమిర్చి - 4,,వెల్లుల్లి రెబ్బలు - 5,,ఉల్లి తరుగు - 1 టేబుల్‌ స్పూను,,కరివేపాకు - 4 రెబ్బలు,,ఆవాలు + జీలకర్ర + మినప్పప్పు - 1 టీ స్పూను, ఇంగువ - చిటికెడు,,నూనె - 1 టేబుల్‌ స్పూను,,ఎండుమిర్చి - 3,,మెంతులు - చిటికెడు,,ధనియాలు - పావు టీ స్పూను, ఉప్పు - రుచికి తగినంత., Instructions: Step 1 వాక్కాయల్ని కడిగి, కోసి లోపలి గింజల్ని తీసేయాలి. కుక్కర్లో పప్పు, పచ్చిమిర్చి, పసుపు, వాక్కాయ తరుగుతో పాటు రెండు కప్పుల నీరు పోసి ఒక విజిల్‌ రాగానే స్టౌవ్‌ ఆపేయాలి. చల్లారాక ఉప్పు వేసి పప్పుని గరిటతోనే కాస్త మెదుపుకోవాలి. Step 2 కడాయిలో నూనె వేసి ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు వేగాక ఆవాలు, మెంతులు, జీలకర్ర, మినప్పప్పు, ఇంగువ, ధనియాలు, కరివేపాకు, ఉల్లి తరుగు ఒకదాని తర్వాత ఒకటి వేగించి, పప్పు మిశ్రమంలో కలపాలి. ఇష్టముంటే కొత్తిమీర తరుగు వేసుకోవచ్చు. ఈ పప్పు పుల్లపుల్లగా ఉండి అన్నంతో చాలా రుచిగా ఉంటుంది.      
Yummy Food Recipes
Add