menthi pulusu recipe By , 2017-10-09 menthi pulusu recipe Here is the process for menthi pulusu making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 25min Ingredients: చింతపండు - 100 గ్రా,మెంతులు - 2 టీ స్పూన్లు,జీలకర్ర - 2 టీ స్పూన్లు,ఆవాలు - 2 టీ స్పూన్లు,మినప్పప్పు - 2 టీ స్పూన్లు,శనగపప్పు - 2 టీ స్పూన్లు,పెసరపప్పు - 2 టీ స్పూన్లు,పచ్చిమిర్చి - 4 లేదా 5,ఎండుమిర్చి - 4,కరివేపాకు - 2 రెమ్మలు,బెల్లం - చిన్న ముక్క,నూనె - టేబుల్ స్పూన్,ఇంగువ - చిటికెడు,ఉప్పు - తగినంత, Instructions: Step 1 చింతపండును నానబెట్టి చిక్కగా పులుసు తీసి పక్కన ఉంచాలి.  Step 2 బాణలిలో నూనె వేసి ఒక స్పూను ఆవాలు, ఒక స్పూను జీలకర్ర, ఒక స్పూను మెంతులు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఇంగువ, కరివేపాకు వేసి పోపు పెట్టాలి. Step 3 ఇవన్నీ వేగిన తర్వాత చింతపండు పులుసు పోసి ఉప్పు వేయాలి.  Step 4 పులుసు ఉడుకుతుండగా మరొక బాణలిలో నూనె వేయకుండా శనగపప్పు, మినప్పప్పు, పెసరపప్పులను వేయించాలి.    Step 5 ఈ పప్పులు చల్లారేలోపు అదే బాణలిలో మెంతులు, ఆవాలు, జీలకర్ర వేయించాలి.    Step 6 చల్లారిన తర్వాత పప్పులను, పోపు దినుసులను విడిగా పొడి చేసుకోవాలి.   Step 7 మరుగుతున్న పులుసులో బెల్లం వేసి, తర్వాత పోపు దినుసుల పొడి వేయాలి.    Step 8 ఆ తర్వాత పప్పుల పొడిని నీటిలో కలిపి (ఉండలు కట్టకుండా ఉండడానికి) పులుసులో పోసి ఐదు నిమిషాల సేపు ఉడికించి దించాలి.          
Yummy Food Recipes
Add
Recipe of the Day