Kova Kajjikaya Recipe By , 2018-03-18 Kova Kajjikaya Recipe Here is the process for Kova Kajjikaya Recipe making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 40min Ingredients: మైదా పిం డి – అరకిలో,పంచదార – కిలో,పాలకోవా - పావుకిలో,జాపత్రి - 2 గ్రాములు,యాలకులు – 2 గ్రాములు,శనగపిండి – 50 గ్రాములు,వంట సోడా - పావు స్పూను,బేకింగ్ పౌడర్ – పావుస్పూను,నెయ్యి – 100 గ్రాములు,రిఫైన్డ్ ఆయిల్ - తగినంత, Instructions: Step 1 ముందుగా శనగపిండిలో కోవా కలిపి కొంచెం వేయించి దించాలి. దానిలో జాపత్రిపొడి, యాలకులపొడి, కొంచెం పంచదార కలిపి ముద్దగా చేయాలి.  Step 2 బాణలిలో మిగిలిన పంచదార పోసి, 2 గ్లాసులు నీళ్ళు పోసి లేత పాకం వచ్చేవరకూ ఉంచి దించాలి.  Step 3 మైదాపిండిలో వంట సోడా, బేకింగ్ పౌడర్ కలిపి జల్లించాలి.  Step 4 అందులో కరగబెట్టిన నెయ్యి కలిపి నీళ్ళు చేర్చి గట్టి ముద్దలా చేయాలి. నిమ్మకాయంత ముద్దలను తీసుకుని పూరీలా, కొంచెం మందంగా ఒత్తి మధ్యలో కోవా మిశ్రమాన్ని పెట్టి అర్ధచంద్రాకారంలో మూసి, అంచులను తడిచేసి, కోవాకు దగ్గరగా చుట్టి కజ్జికాయలు చేయాలి.    Step 5 వీటిని నూనెలో వేయించి కొంచెం రంగు రాగానే తీసి, పంచదార పాకంలో వేసి ముంచి తీస్తే సరి, నోరూరించే కోవా కజ్జికాయలు సిద్దం!      
Yummy Food Recipes
Add
Recipe of the Day