Lauki vadalu Recipe By , 2017-10-30 Lauki vadalu Recipe Here is the process for Lauki vadalu making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 15min Ingredients: బియ్యంపిండి - ఒక కప్పు,ఆనపకాయ - ఒక చిన్నసైజు ముక్క,పచ్చిమిర్చి - 5,అల్లం - చిన్నముక్క,ఉప్పు - రుచికి తగినంత,వంటసోడా - చిటికెడు,నూనె - వేయించడానికి సరిపడినంత, Instructions: Step 1 ముందుగా ఆనపకాయను కోరుకొని పెట్టుకోవాలి (గ్రైండ్ చేయోద్దు నీరైపోతుంది).  Step 2 కోరిన తరువాత బియ్యం పిండిలో ఈ కోరును వేసి.. అల్లం, పచ్చిమిర్చి, ఉప్పును కూడా గ్రైండ్ చేని  ఈ మిశ్రమాన్ని కూడా బియ్యంపిండిలో వేసి కలపాలి. Step 3 ఇప్పుడు బియ్యంపిండికి సరిపడినంత ఆనపకాయ తురుమును కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. (ఆనపకాయలో నీరు ఉంటుంది కాబట్టి ప్రత్యేకంగా నీరు పోయాల్సిన అవసరం ఉండదు). Step 4 ఆఖరిలో ఒక రెండు చెంచాలు నూనె వేసి పిండి దగ్గరగా కలుపుకోవాలి వడల పిండిలా. ( గట్టిగా కాకుండా, మెత్తగా కాకుండా).    Step 5 ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక పదినిమిషాలు పక్కన పెట్టుకొని ఈలోపు బాణలిలో నూనె వేసి అది కాగిన తరువాత ఓ కవర్ కి కాని చేతికి కాని కొంచం నూనె రాసుకొని వడలుగా వత్తుకొని నూనెలో వేసి వేయించాలి.   Step 6 వడలని బంగారు వర్ణం వచ్చేంతవరకూ వేయిస్తే చాలు ఎందుకంటే ఆనపకాయ తురుము ఉంది కాబట్టి తొందరగా మాడే అవకాశం ఉంటుంది. అంతే ఆనపకాయ వడలు(లౌకి వడలు ) రెడీ.              
Yummy Food Recipes
Add
Recipe of the Day