jack fruit masala balls By , 2014-07-31 jack fruit masala balls jack fruit masala balls - its a perfect side dish, tasty and easy preparation jack fruit masala balls Prep Time: 20min Cook time: 35min Ingredients: అరకప్పు పనస ఉడికించినది (జాక్ ఫ్రూట్), అరకప్పు బంగాళదుంప ముక్కలు (ఉడికించినవి), 1 టీస్పూన్ పల్లీలపొడి (బరకగా గ్రైండ్ చేయాలి), అరకప్పు ఉల్లిపాయ తరుగు, ఒకటీస్పూన్ అల్లంవెల్లుల్లి పేస్ట్, అరకప్పు స్కిమ్ డ్ మిల్క్, 1 టీస్పూన్ పసుపు, 1 టీ స్పూన్ మిరియాలపొడి, 1 టీస్పూన్ జీలకర్రపొడి, 1 టీస్పూన్ ధనియాలపొడి, 1 టీస్పూన్ కొత్తిమీర తరుగు, 1 టేబుల్ స్పూన్ నూనె, 1 టీ స్పూన్ పచ్చిమిర్చి తరుగు, తగినంత ఉప్పు, Instructions: Step 1 నాన్ స్టీక్ పాన్ లో నూనే వేసి అది వేడి అయిన తరువాత అందులో మిరియాలపొడి, ధనియాల పొ డి, జీలకర్ర పొడులు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ తరుగులను వేసి వేయించాలి. ఉల్లిపాయలు బాగా వేగిన తరువాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్‌ వేసి బాగా ఫ్రై చేయాలి. Step 2 ఇందు లోనే పల్లీల పొడి, పసుపు, తగినంత ఉప్పువేసి బాగా కలిపి వేయించాలి. తరువాత దానికి పనస, బంగాళా దుంపల మిశ్రమాలను చేర్చి బాగా కలిపి వేయించాలి. Step 3 చివరగా స్కిమ్‌డ్‌ మిల్క్‌ చేర్చి బాగా కలిపి అవి ఇగిరేంతదాకా సన్నటి మంట పై ఉడికించాలి. మిశ్రమం అంతా దగ్గర పడ్డాక కొత్తిమీర తరుగును వేసి బాగా కలిపాలి. Step 4 ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కిందికి దించి చల్లారి న తరువాత ఉండలుగా చుట్టి, టొమోటో చట్నీ లేదా జామ్‌తో కలిపి సర్వ్‌ చేయాలి. అంతే రుచికరమైన పనస మసాలా బాల్స్‌ రెడీ. తక్కువ నూనెతో తయారయ్యే ఇవి తక్కువ కొవ్వును కలిగి ఉంటాయి. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారికి ఈ రెసిపి చాలా ఉపయోగపడుతుంది.
Yummy Food Recipes
Add