potato green kurma recipe By , 2017-08-24 potato green kurma recipe Here is the process for potato green kurma making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 25min Ingredients: బంగాళదుంపలు - 4,,ఉల్లిపాయ - 2,కొబ్బరిపొడి - 3 టీ స్పూన్లు,,పెరుగు - అర కప్పు,కొత్తిమీర - ఒక కట్ట,,పుదీనా - చిన్న కట్ట,పచ్చిమిర్చి - 5 లేదా 6,,గరంమసాలా పొడి - పావు టీ స్పూను,,పసుపు - పావు టీ స్పూను,అల్లం వెల్లుల్లి ముద్ద - టీ స్పూను,,నూనె - 4 టీ స్పూన్లు, Instructions: Step 1 పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, పెరుగు, కొబ్బరిపొడి ... వీటిని మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.  Step 2 బంగాళదుంపలను చెక్కుతీసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. వెడల్పాటి పాన్‌లో నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు (గ్రైండ్ చేసినా పరవాలేదు) వేసి మెత్తబడేవరకు వేయించాలి.  Step 3 ఇందులో పసుపు, అల్లంవెల్లుల్లి ముద్ద వేసి మరో రెండు నిముషాలు వేయించి బంగాళదుంప ముక్కలు వేసి ఐదు నిముషాలు చిన్న మంటపై వేయించాలి.  Step 4 ఇందులో గ్రైండ్ చేసిన మసాలా ముద్ద, తగినంత ఉప్పు, అరకప్పుడు నీళ్లు పోసి కలిపి మూతపెట్టాలి.    Step 5 కూర ఉడికి నూనె తేలినప్పుడు గరంమసాలా పొడి కలిపి దింపేయాలి. ఈ ఖుర్మా పులావ్, నాన్, చపాతీలలోకి బావుంటుంది.              
Yummy Food Recipes
Add
Recipe of the Day