Ugadi special coconut vada By , 2018-03-17 Ugadi special coconut vada Here is the process for Ugadi special coconut vada making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 25min Ingredients: కొబ్బరి: 2 cups(తురిమినది),సూజి: ½cup,శెనగపిండి: ½cup,ఆవాలు: 1tsp,పచ్చిమిర్చి: 7(సన్నగా తరిగిపెట్టుకోవాలి),కరివేపాకు: రెండు రెమ్మలు(సన్నగా తరిగిపెట్టుకోవాలి),నెయ్యి: 1tbsp,నూనె: 2 cups,ఉప్పు: రుచికి సరిపడా, Instructions: Step 1 ముందుగా కొబ్బరి తరుగు, శెనగపిండి మరియు సూజి రవ్వ ఒక మిక్సింగ్ బౌల్లో వేసి మూడింటిని బాగా మిక్స్ చేయాలి.  Step 2 ఇప్పుడు అందులో అరకప్పు నీళ్ళు పోసి ఉండలు లేకుండా చిక్కగా కలుపుకోవాలి.  Step 3 ఇప్పుడు పాన్ లో నెయ్యి వేసి, వేడి చేయాలి. వేడయ్యాక అందులో ఆవాలు, కరివేపాకు వేసి వేగించుకోవాలి. ఒక సెకను వేగించుకొన్న తర్వాత వీటిని కలిపి పెట్టుకొన్న పిండిమిశ్రమంలో వేయాలి.  Step 4 తర్వాత అందులో ఉప్పు మరియు పచ్చిమిర్చి తరుగు వేసి, చేత్తో మొత్తం మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి.    Step 5 ఇప్పుడు స్టౌ మీద ఒక డీప్ బాటమ్ పాన్ పెట్టి, ఆయిల్ వేసి కాగనివ్వాలి. నూనె కాగిన తర్వాత పిండిని చేతిలోకి తీసుకొని వడలులాగా తట్టుకొని కాగేనూనెలో వేసి డీప్ ఫ్రైచేసుకోవాలి.    Step 6 అంతే కొబ్బరి వడలు రెడీ. ఈ క్రిస్పీ కొబ్బరి వడలను కొత్తమీర చట్నీ లేదా రెడ్ చిల్లీ చట్నీతో సర్వ్ చేయాలి.                  
Yummy Food Recipes
Add