semiya cutlets recipe By , 2017-08-16 semiya cutlets recipe Here is the process for semiya cutlets making .Just follow this simple tips Prep Time: 20min Cook time: 15min Ingredients: సేమ్యా - సగం కప్పు,ఉడికించిన బంగాళాదుంప పేస్ట్ - కప్పు,బ్రెడ్ పౌడర్ - 3 టీ స్పూన్లు,వేయించి పొట్టు తీసిన వేరుశనగ పప్పు -,3 టేబుల్‌స్పూన్లు,పచ్చిమిర్చి ముక్కలు - రెండు టీ స్పూన్లు,ఉల్లిపాయ - ఒకటి,ఉప్పు - రుచికి సరిపడా,కారం - టీ స్పూన్,జీలకర్ర - టీ స్పూన్,కొత్తిమీర - 3 టీ స్పూన్లు,నూనె - వేయించడానికి తగినంత,నిమ్మరసం - టీ స్పూన్, Instructions: Step 1 ముందుగా స్టౌపై గిన్నెపెట్టి సేమ్యాను నూనె లేకుండా గోధుమరంగు వచ్చే వరకు వేయించి, తీసి పక్కన పెట్టుకోవాలి.  Step 2 మరొక గిన్నెలో బంగాళదుంప పేస్ట్, ఉప్పు, కారం, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ పేస్ట్, వేరుశనగ పప్పులు, జీలకర్ర, కొత్తిమీర, సేమ్యా, నిమ్మరసం.. ఒకదాని తర్వాత ఒకటి వేసి బాగా కలిపి ఐదునిముషాలు పక్కన పెట్టుకోవాలి.  Step 3 తర్వాత స్టౌపై కడాయి పెట్టి, నూనె పోసి, కాగనివ్వాలి.  Step 4 తర్వాత సేమ్యా మిశ్రమాన్ని కావాల్సిన ఆకారంలో చేసుకొని బ్రెడ్ పౌడర్‌లో అటూ ఇటూ డిప్ చేసి నూనెలో వేయించుకోవాలి.  Step 5 రెడీ అయిన సేమ్యా కట్‌లెట్స్ వేడివేడిగా, కరకరలాడుతూ నోరూరిస్తాయి.  
Yummy Food Recipes
Add