bread upma By , 2017-12-22 bread upma Here is the process for bread upma making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 15min Ingredients: బ్రెడ్‌ స్లైసులు - ఐదు,,ఉల్లిపాయ, టొమాటో - ఒక్కోటి చొప్పున,పచ్చిమిర్చి - రెండు,,అల్లంతరుగు - కొద్దిగా, పసుపు - చిటికెడు,,సాంబార్‌పొడి - చెంచా,,నెయ్యి - నాలుగు చెంచాలు,,ఉప్పు - తగినంత,,ఆవాలు, సెనగపప్పు - అరచెంచా చొప్పున., Instructions: Step 1 ముందుగా బ్రెడ్‌ స్లైసుల్ని ముక్కలుగా కోసి పెట్టుకోవాలి. బాణలిలో రెండు చెంచాల నెయ్యి వేసి పొయ్యిమీద పెట్టాలి. అది కరిగాక బ్రెడ్‌ ముక్కల్ని వేయించి తీసి పెట్టుకోవాలి. అదే బాణలిలో మిగిలిన నెయ్యి వేయాలి. Step 2 అది కరిగాక ఆవాలూ, సెనగపప్పూ, ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలూ, అల్లం తరుగూ, కరివేపాకు వేయాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగాక టొమాటో ముక్కలూ, పసుపూ, సాంబార్‌ పొడీ, ఉప్పూ వేసి మంట తగ్గించాలి. Step 3 టొమాటోలు మెత్తగా అయ్యాక బ్రెడ్‌ ముక్కలు వేసి బాగా కలపాలి. రెండు మూడు నిమిషాలయ్యాక దింపేయాలి.        
Yummy Food Recipes
Add
Recipe of the Day