aratikaya vepudu recipe By , 2017-07-24 aratikaya vepudu recipe Here is the process for aratikaya vepudu making .Just follow this simple tips Prep Time: 5min Cook time: 10min Ingredients: అరటికాయలు : రెండు,పచ్చిమిర్చి : నాలుగు,పోపు దినుసులు : రెండు టీ స్పూన్లు,(ఆవాలు ,జీలకర్ర ,మినపప్పు సెనగపప్పు ),ఎండిమిర్చి: రెండు,కరివేపాకు : రెండు రెమ్మలు,పసుపు : పావు టీ స్పూన్,ఉప్పు : తగినంత,నూనె : రెండు టేబుల్ స్పూన్లు,నిమ్మరసం : టీ స్పూన్,అల్లంవెల్లుల్లి పేస్టూ : అర టీ స్పూన్,కొత్తిమిర : కొద్దిగా, Instructions: Step 1 అరటికాయల్నిఒక గిన్నెలో వేసి కొద్దిగా నీళ్ళుపోసి స్టవ్ మీద పెట్టి ఉడకనివ్వాలి. Step 2 తరువాత వలిచి చిన్నచిన్న ముక్కలు ఉండేలా చిదపాలి. Step 3 ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయిపెట్టి నూనె వేడి చెయ్యాలి. Step 4 నూనె కాగాక, పోపు దినుసులు వేసి వేగాక, ఎండిమిర్చి, కరివేపాకు వేసి వేగాక, అల్లంవెల్లుల్లి, పచ్చి మిర్చి ముక్కలు వేసి వేగానివ్వాలి. Step 5 పసుపు వేసి కలిపి, చిదిమిన అరటికాయపొడిని, ఉప్పు వేసి కలిపి ఒక నిముషo మూతపెట్టి ఉంచాలి. Step 6 ఇప్పుడు స్టవ్ ఆపి, నిమ్మ రసం కలిపి కొత్తిమిర జల్లి వడ్డించాలి. అంతే అరటికాయ వేపుడు రెడి. (దినినినే అరటికాయ పొడికూర అని కుడా అనొచ్చు)      
Yummy Food Recipes
Add