kakarakaya nuvvula pulusu recipe By , 2017-07-24 kakarakaya nuvvula pulusu recipe Here is the process for kakarakaya nuvvula pulusu making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 15min Ingredients: కాకరకాయలు - 5,,బెల్లం - 2 స్పూన్,,కరివేపాకు - కొద్దిగా,,పచ్చిమిర్చి - 3,,పసుపు - 1/4 స్పూన్,,నూనె - 5 స్పూన్స్,,నువ్వుల పొడి - 4 స్పూన్స్,,ఉప్పు, కారం - సరిపడ,,ధనియాల పొడి - 1 స్పూన్ ,,చింతపండు - కొద్దిగా,,పోపు గింజలు - 1 స్పూన్, Instructions: Step 1 ముందుగా కాకరకాయల్ని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. Step 2 చింతపండు నానపెట్టి బాగా గుజ్జు తయారు చేసుకోవాలి. Step 3 అర కప్పు నీళ్ళలో వేసి నానబెట్టాలి. తరువాత నువ్వులను వేయించి పొడి చేసుకోవాలి. Step 4 తరువాత బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగిన తరువాత కాకరకాయ ముక్కలు వేసి 10 నిముషాలు వేయించిన తరువాత తీసి పక్కన పెట్టుకోవాలి. Step 5 ఇప్పుడు బాణలిలో పోపు పెట్టి, వేగాక చింతపండు గుజ్జు, అరకప్పు నీళ్ళు పోసి బాగా కలపాలి.  Step 6 తరువాత అందులో ఉప్పు, కారం, ధనియాల పొడి, పసుపు వేసి మూత పెట్టి బాగా ఉడికించాలి. Step 7 ఇప్పుడు అందులో బెల్లం కలిపిన నీళ్ళు మరియు నువ్వుల పొడి వేసి మూత పెట్టి ముక్కలు బాగా మెత్తగా అయ్యేవరకు ఉంచి దించెయ్యాలి. Step 8 అంతే రుచికరమైన కాకరకాయ నువ్వుల పులుసు  
Yummy Food Recipes
Add