aloo pancakes recipe By , 2017-08-07 aloo pancakes recipe Here is the process for aloo pancakes making .Just follow this simple tips Prep Time: 20min Cook time: 15min Ingredients: తురిమిన ఆలు : 2 కప్పులు,తురిమిన ఉల్లిపాయ: 1/4 కప్పు,మైదా : 1 కప్పు,మిరియాలపొడి: 1/4 స్పూన్‌,ఉప్పు: తగినంత,నూనె: 1 స్పూన్‌,బేకింగ్‌ పౌడర్‌: 1/2 స్పూన్‌,బేకింగ్‌ సోడా: ఒక చిటికెడ్‌ (కావాలనుకుంటే), Instructions: Step 1 ముందుగా తురిమి పెట్టుకున్న ఆలు, ఉల్లిపాయలను కలిపి విడిగా పెట్టుకోవాలి.  Step 2 ఆలూను తురిమిన వెంటనే నీళ్ళలో వేస్తే రంగు మారదు. తర్వాత మైదా, ఉప్పు, మిరియాల పొడి, బేకింగ్‌ పౌడర్‌, బేకింగ్‌ సోడాలను కలుపుకోవాలి.  Step 3 అందులో కలిపి పెట్టుకున్న ఆలు, ఉల్లి తురుమును కలిపి అందులో జారుగా వచ్చేలా తగినన్ని నీళ్ళు కానీ పాలు కానీ పోసి కలుపుకోవాలి.  Step 4 ఎక్కువ నీరు పోయడం మంచిది కాదు. ఎందుకంటే ఆలు, ఉల్లిపాయ కూడా నీటిని విడుదల చేస్తాయి.  Step 5 గరిట జారుగా కలుపుకున్న పిండిని ఎక్కువగా కలపకుండా ఉంటేనే మంచిది. Step 6 తర్వాత పొయ్యి మీద తావను పెట్టి వేడెక్కిన తరువాత దానిపై కాస్త నూనె పోసి తావ అంతా అంటేలా గరిటతో తిప్పాలి.  Step 7 తర్వాత ఒక కపెద్ద గరిటెడు పిండిని తీసుకుని దోశలకు పోసినట్టుగా పోయాలి.  Step 8 అయితే ఇది పల్చగా మాత్రం ఉండకూడదు. ఎంత పెద్దది, ఎంత చిన్నది వేయాలనేది మన ఇష్టం. రెండు నిమిషాలపాటు దానిని ఉడకనిచ్చి రెండో వైపుకి తిప్పాలి.  Step 9 ఆ వైపు కూడా అలాగే కాలే దాకా ఉంచాలి. దీనిని టమేటో కెచప్‌తో కానీ జామ్‌తో కానీ చట్నీతో కానీ దేనితోనైనా తినవచ్చు. కొబ్బరి చట్నీ అయితే కొందరు లొట్టలేస్తారు.  
Yummy Food Recipes
Add