mamidi munakkada pulusu recipe By , 2017-06-29 mamidi munakkada pulusu recipe Here is the process for mamidi munakkada pulusu making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: మామిడికాయలు-2,మునక్కాడలు-4,ఉల్లిపాయలు-2,పచ్చి మిరపకాయలు-5,ఆవాలు, జీలకర-1 టీ స్పూను,కరివేపాకు-2 రెబ్బలు,వెల్లుల్లి రేకులు-4,కారం-2 టీ స్పూన్లు,ఉప్పు-తగినంత,నూనె-సరిపడా, Instructions: Step 1 మామిడికాయల్ని పెద్ద పెద్ద ముక్కలుగా కోసుకోవాలి. ములక్కాడలను కావాల్సిన సైజులో ముక్కలుగా కోసి పెట్టుకోవాలి.  Step 2 ఉల్లిపాయల్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. తర్వాత గిన్నెలో నూనె వేడిచేసి ఆవాలు, జీలకర, కరివేపాకు, వెల్లుల్లిరేకలు వేయాలి.  Step 3 అందులోనే పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి వేయించుకోవాలి. దానికి ఉప్పు, కారం జతచేసి బాగా కలపాలి.  Step 4 అందులోనే ములక్కాడ ముక్కలు కూడా వేసి రెండు నిముషాలు మగ్గనివ్వాలి. తర్వాత మామిడికాయ ముక్కలు కూడా వేసి వేయించుకోవాలి.  Step 5 తర్వాత అందులో రెండు గ్లాసుల నీళ్లు పోసి ఓ పదినిముషాలు పులుసుని మరిగించాలి. ముక్కలు బాగా మెత్తబడ్డాక దించేయాలి.  
Yummy Food Recipes
Add