Bread samosa By , 2018-04-30 Bread samosa Here is the process for Bread samosa making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 40min Ingredients: నూనె - రెండు టేబుల్ స్పూన్లు;,ఉల్లితరుగు - పావుకప్పు,వెల్లుల్లి తరుగు - టీ స్పూను;,ఎండుమిర్చి - 3;,పచ్చిమిర్చి తరుగు - 2 టీ స్పూన్లు,బంగాళదుంప - 1 (పెద్దది, ఉడికించి, తొక్క తీసి, చిన్నచిన్నముక్కలుగా చేయాలి),ఉడికించిన బఠాణీ - 50 గ్రా.;,ధనియాల పొడి - 2 టీ స్పూన్లు,కొత్తిమీర తురుము - 2 టేబుల్ స్పూన్లు;,వైట్ బ్రెడ్ - 8 (పెద్ద స్లైసులు, చివర్లు తీసేయాలి),డీప్ ఫ్రైకోసం నూనె - తగినంత, Instructions: Step 1 స్టౌ మీద పాన్ ఉంచి, రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి కాగాక, ఉల్లితరుగు, వెల్లుల్లి తరుగు, పచ్చిమిర్చి తరుగు వేసి రెండు నిముషాలు వేయించాలి.  Step 2 బంగాళదుంప ముక్కలు, బఠాణీ, ధనియాలపొడి వేసి బాగా మెత్తగా అయ్యేలా కలిపి, రెండు నిముషాలు ఉడికించాలి. Step 3 కిందకు దించి ఉప్పు, మిరియాలపొడి, కొత్తిమీర తురుము వేసి కలపాలి. Step 4 బ్రెడ్ స్లైసులు ఫ్లాట్‌గా అయ్యేలా అప్పడాల కర్రతో నెమ్మదిగా ఒత్తాలి.   Step 5 ఉడికించుకున్న మిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకుంటూ, బ్రెడ్ పీస్ మీద ఉంచి పైన మరో పీస్ ఉంచి, అంచులను నీటితో తడుపుతూ అంతా మూసుకునేలా సమోసా ఆకారంలో జాగ్రత్తగా మూయాలి.   Step 6 స్టౌ మీద పాన్ ఉంచి నూనె పోసి కాగాక, తయారుచేసి ఉంచుకున్న సమోసాలను వేసి వేయించాలి    Step 7 బంగారురంగులోకి వచ్చాక తీసి, పేపర్ టవల్ మీద ఉంచాలి.           
Yummy Food Recipes
Add