vankaya pachi pulusu recipe By , 2017-06-29 vankaya pachi pulusu recipe Here is the process for vankaya pachi pulusu making .Just follow this simple tips Prep Time: 5min Cook time: 20min Ingredients: పెద్ద వంకాయ-1,ఉల్లి తరుగు-1 కప్పు,చింతపండు-నిమ్మకాయంత,పచ్చిమిర్చి తరుగు-2 టీ స్పూన్లు,బెల్లం-ఒకటిన్నర టీ స్పూన్లు,కొత్తిమీర తరుగు-అర కప్పు,నీరు-ఒకటిన్నర కప్పు,ఉప్పు-రుచికి తగినంత,తాలింపు కోసం-ఎండుమిర్చి, ఆవాలు, జీలకర, మినపప్పు, ఇంగువ, వెల్లుల్లి రేకలు, కరివేపాకు,నూనె-సరిపడా, Instructions: Step 1 ముందుగా చింతపండు నానబెట్టి రసం తీసి పెట్టుకోవాలి. గ్యాస్‌పై వేడి బాణలిలో నూనె రాసిన వంకాయను అన్ని వైపులా తిప్పుతూ కాల్చుకోవాలి.  Step 2 చల్లారిన తర్వాత తొక్క తీసి గుజ్జుగా నలపాలి. ఒక పాత్రలో గుజ్జుతోపాటు ఉల్లి, పచ్చిమిర్చి, బెల్లం తరుగు, చింతపండు రసం, ఉప్పువేసి అన్నీ కలిసేలా చేతితో పిసికి నీరు పోయాలి.  Step 3 తర్వాత దానిలో తాలింపు చేర్చి, కొత్తిమీర చల్లాలి. ఇది అన్నంతోపాటు పులగంలోకి కూడా బాగుంటుంది.       
Yummy Food Recipes
Add