lamb vinda recipe By , 2017-06-28 lamb vinda recipe Here is the process for lamb vinda making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 25min Ingredients: మాంసం-600 గ్రాములు,బంగాళాదుంపలు(చిన్నవి)-5,వెల్లుల్లి తరుగు-1/4 కప్పు,టమాట ముక్కలు-1 కప్పు,వెనిగర్‌/నిమ్మరసం-1/4 కప్పు,ఉప్పు-రుచికి తగినంత,చక్కెర-2 టేబుల్‌ స్పూన్లు,ఎండుమిర్చి-1/2 కప్పు,చింతపండు గుజ్జు-1టేబుల్‌ స్పూన్‌,ఉల్లిపాయల తరుగు-1 కప్పు,వెన్న - 1/2 కప్పు,నూనె-2 టేబుల్‌ స్పూన్లు,జీలకర్ర-1 టీ స్పూన్‌, Instructions: Step 1 కూర తయారు చేయడానికి నాలుగు గంటల ముందు ఎండుమిర్చీ, ముప్పావు వంతు వెల్లుల్లి ముక్కలూ, జీలకర్ర, చింతపండును వెనిగర్‌లో వేసి నాననివ్వాలి.  Step 2 తర్వాత రెండు చెంచాల నూనెవేసి అన్నింటినీ మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి. మాంసం ముక్కల్ని కుక్కర్‌లో మెత్తగా ఉడికించుకోవాలి.  Step 3 బంగాళాదుంపల్ని కూడా పెచ్చు తీసి విడిగా ఉడికించుకుని పెట్టుకోవాలి.  Step 4 వెడల్పాటి గిన్నె తీసుకుని అందులో నూనె వేడిచేసి మిగిలిన జీలకర్ర, వెల్లుల్లి తరుగు, ఉల్లిపాయ ముక్కలూ వేసి వేయించుకోవాలి.  Step 5 ఉల్లిపాయ ముక్కలు వేగాక టొమాటో ముక్కలు వేసి వేయించుకోవాలి. తర్వాత ఎండుమిర్చి మసాలాను వేసి కాస్త తక్కువ మంటపై ఉడకనివ్వాలి. Step 6  పచ్చి వాసన పోయి నూనె పైకి తేలుతున్నప్పుడు ఉడికించి పెట్టుకున్న మాంసం, బంగాళాదుంప ముక్కల్ని కూడా వేసి రెండు నిమిషాలు ఉడకనివ్వాలి.  Step 7 తర్వాత వెన్న, చక్కెర, తగినంత ఉప్పుని వేసి కలిపి స్టౌ పైనుంచి దింపేయాలి.  
Yummy Food Recipes
Add