dhum alu By , 2014-07-19 dhum alu dhum alu its very popular vegetarian dish from kashmir- india, easy to prepare restaurant style dhum alu.... Prep Time: 20min Cook time: 45min Ingredients: చిటికెటు జాజికాయపొడి, చిటికెడు పసుపు, 2 ఎండుమిర్చి, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీస్పూన్ గసగసాలు, 6 మిరియాలు, 2 ఉల్లిపాయ, 1 దాల్చిన చెక్క, 4 యాలకులు, 4 బిర్యానిఆకు, 4 లవంగాలు, తగినంత ఉప్పు, 1 టీస్పూన్ గరం మసాల, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 పచ్చిమిర్చి, 4 టేబుల్ స్పన్ వేడినీళ్ళు, 1 కప్పు పెరుగు, 4 టేబుల్ స్పూన్లు టమాటప్యూరి, తగినంత నూనె, 3 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, Instructions: Step 1 ఆలు గడ్డలకు తొక్కు తీసి ఫోర్క్‌తో దానిపై గాట్లుపెట్టి వాటిని కొద్దిగా ఉప్పు వేసిన నీటిలో రెండు గంటలపాటు ఉంచాలి. Step 2 తర్వాత వాటి ని తీసి ఒక బట్టపై ఆరబెట్టాలి. బాణలిలో నూనె కానీ నెయ్యి కానీ పోసి వేడి అయిన తర్వాత ఈ ఆలుగడ్డలను బంగారు రంగు వ చ్చే వరకు వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. Step 3 తర్వాత కొద్దిగా నెయ్యి వేసి అందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, మసాలా ది నుసులు వేసి బంగారు రంగు వచ్చే వరకూ వేయించుకోవాలి. ముద్దకోసం పెట్టుకున్న వా టన్నింటినీ మెత్తగా నూరి వేగిన ఉల్లిపాయలలో వేయాలి. ఈ మొత్తాన్ని 10 నిల పాటు ఉడకనివ్వాలి. Step 4 తరువాత దానిపై టొమాటో గుజ్జు, పెరుగు, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో.. వేయించి పెట్టుకున్న ఆలూ, వేడినీటిని వేసి ఒక 5 నిల పాటు తక్కువ మంట మీద కలుపుతూ ఉంచాలి. Step 1 దమ్‌ ఆలూపై మిరియాలపొడి, గరం మసాలా పొడి వేసి కొద్ది నిమిషాల పాటు ఉడకనిచ్చి దించేయాలి. వేడి వేడి దమ్‌ ఆలూ రెడీ‌. ఇది చపాతీలలోకి, అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది.
Yummy Food Recipes
Add
Recipe of the Day