Jeedipappu semiya upma recipe By , 2017-03-18 Jeedipappu semiya upma recipe Here is the process for Jeedipappu semiya upma making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: దోరగా వేయించిన సేమ్యా- 1 కప్పు, , తరిగిన పచ్చిమిర్చి- 2 లేక 3, , క్యారెట్ - 1 చిన్నది, , తరిగిన ఉల్లిపాయ-1, , తరిగిన టమాటా -1, , సన్నగా తరిగిన అల్లం ముక్కలు -కొద్దిగా, , కొత్తిమీర- 2 రెమ్మలు, , నిమ్మ రసం- 2 టీ స్పూన్స్, , ఉప్పు- తగినంత తాలింపు కొరకు: , నూనె- 2 టీస్పూన్స్, , ఆవాలు- పావు టీస్పూన్, , పచ్చిపప్పు- 1/2 టీస్పూన్, , జీలకర్ర - పావు టీ స్పూన్, , జీడిపప్పు- 20, , ఎండుమిర్చి-2, , కరివేపాకు- 1 లేక 2 రెమ్మలు. , Instructions: Step 1 ముందుగా ఒక పాత్ర తీసుకుని కొంచెం నూనె పోసి వేడిచేయాలి. Step 2 దానిలో ఆవాలు, పచ్చిసెనగ పప్పు , జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, మరియు జీడిపప్పు కూడా వేసి దోరగా వేయించాలి. Step 3 అల్లం, పచ్చిమిర్చి వేసి 1 నిమిషం వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు, కొంచెం ఉప్పుకూడా వేసి 2 నిమిషాలు మూత పెట్టి ఉంచాలి. Step 4 తర్వాత క్యారెట్ కూడా వేసి మరో 2 నిమిషాలు వేయించి, టమాటో ముక్కలు వేసి మూత పెట్టి 5 నిమిషాలు వేయించాలి. Step 5 తర్వాత 2 కప్పుల నీరు మరియు తగినంత ఉప్పు వేసి బాగా మరిగి పొంగు వచ్చేవరకు ఉంచాలి. Step 6 ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న సేమ్యా నినీటిలో వేస్తూ కలపాలి . Step 7 తర్వాత కొంచెం కొత్తిమీర వేసి మూతపెట్టి, మంట మీడియం లో ఉంచాలి. Step 8 మరో 5 నిమిషాలు ఆగి, ఒకసారి సేమ్యాని తిప్పి మూతపెట్టి తక్కువ మంట మీద, నీరు అంతా పూర్తిగా పోయే వరకు ఉంచాలి. Step 9 తర్వాత స్టవ్ కట్టేసి నిమ్మరసం వేసి కలిపి, చివరిగా కొత్తిమీర చల్లి ప్లేటులోకి తీసుకోవాలి. వేడివేడి జీడిపప్పు సేమ్యా రెడీ అయిపోయింది.
Yummy Food Recipes
Add