Bombai ravva upma recipe By , 2017-03-18 Bombai ravva upma recipe Here is the process for Bombai ravva upma making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: బొంబాయి రవ్వ -1 కప్పు, , మంచి నీరు -2 కప్పులు, , ఉల్లిపాయ -1, , పచ్చిమిర్చి-4, , క్యారెట్ ముక్కలు -1/2 కప్పు, , పచ్చి బఠాణి -3/4 కప్పు, , టమాటా ముక్కలు -1/2 కప్పు, , అల్లం ముక్కలు -1 టేబుల్ స్పూన్, , వేరుశెనగలు(పల్లీలు) -1/4 కప్పు, , జీలకర్ర -1 టీస్పూన్, , పచ్చిపప్పు -1 టీస్పూన్,, ఆవాలు -1/2 టీస్పూన్, , కరివేపాకు -2రెమ్మలు, , కొత్తిమీర -తగినంత, , ఉప్పు-రుచికి సరిపడినంత, , నిమ్మరసం -1 టేబుల్ స్పూన్., Instructions: Step 1 ముందుగా కడాయి స్టవ్ మీద పెట్టుకుని రవ్వ వేసి 5 నిమిషాలు పచ్చి వాసనా పోయే వరకు వేయించి, వేరే గిన్నెలోకి పోసుకుని పక్కన పెట్టుకోండి. Step 2 అదే కడాయిలో నూనె పోసి ఆవాలు, పచ్చిపప్పు, జీలకర్ర, కరివేపాకు, వేరుశెనగ విత్తులు వేసి వేయించుకోవాలి. Step 3 తరువాత అల్లం, పచ్చి మిర్చి వేసి వేగాక క్యారెట్ ముక్కలు, పచ్చి బఠాణి వేసి కొంచెం ఉప్పు చల్లి మూత పెట్టి తక్కువ మంట మీద 5 నిమిషాలు మగ్గనివ్వాలి. Step 4 తరువాత టమాటా ముక్కలు, కొత్తిమీర కూడా వేసి మరో 5 నిమిషాలు ఉంచి దానిలో నీరు పోసి, ఉప్పు కూడా వేసుకుని మరగనివ్వాలి. Step 5 నీరు బాగా మరిగి పొంగు వస్తున్నప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న రవ్వని నీటిలో వేస్తూ తిప్పుకోవాలి. స్టవ్ మంట తగ్గించి రవ్వని బాగా ఉండలు లేకుండా కలయబెట్టుకుని 10 నిమిషాలు ఉడికించుకోవాలి. Step 6 చివరగా కొత్తిమీర , నిమ్మరసం వేసుకుని కలుపుకుని ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. కారం పొడిలో నెయ్యి వేసుకుని తింటే ఉప్మా చాలా రుచిగా ఉంటుంది.  
Yummy Food Recipes
Add
Recipe of the Day