Mushroom manchurian By , 2018-01-25 Mushroom manchurian Here is the process for Mushroom manchurian making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 25min Ingredients: బటన్‌ మష్రూమ్స్‌ – పావుకేజీ,,మైదా – ముప్పావుకప్పు,,మొక్కజొన్నపిండి – పావుకప్పు,,కారం – అరచెంచా,,వెల్లుల్లి తరుగు – చెంచా,,ఉప్పు – తగినంత,,నీళ్లు – పిండి కలిపేందుకు,,నూనె – వేయించేందుకు సరిపడా.,,మంచూరియా మసాలా కోసం: ,నూనె – రెండు టేబుల్‌స్పూన్లు,,అల్లం,వెల్లుల్లి తరుగు – అరటేబుల్‌స్పూను చొప్పున,,క్యాప్సికం, ఉల్లిపాయ – ఒక్కోటి చొప్పున,,సోయా సాస్‌ – రెండు టేబుల్‌స్పూన్లు,,చిల్లీసాస్‌ – టేబుల్‌స్పూను,,కారం – అరచెంచా,,మిరియాలపొడి – పావుచెంచా,,ఉప్పు – తగినంత,,ఉల్లికాడల తరుగు – కొద్దిగా., Instructions: Step 1 పుట్టగొడుగుల్ని కడిగి, తుడిచి పెట్టుకోవాలి. పిండికోసం తీసుకున్న పదార్థాల్లో నూనె తప్ప మిగిలినవన్నీ ఓ గిన్నెలోకి తీసుకుని కలపాలి. ఈ మిశ్రమం దోశపిండిలా ఉండాలి.  Step 2 ఇప్పుడు బాణలిలో నూనె వేడిచేసుకోవాలి. ఒక పుట్టగొడుగును తీసుకుని ఈ పిండిలో ముంచి, కాగుతోన్న నూనెలో వేసి ఎర్రగా వేగాక తీసుకోవాలి. Step 3 ఇప్పుడు మంచూరియా మసాలా తయారు చేసుకోవాలి. బాణలిలో నూనె వేసి పొయ్యిమీద పెట్టాలి.  Step 4 అది వేడయ్యాక ఉల్లిపాయ, క్యాప్సికం ముక్కలు వేయాలి. రెండు నిమిషాలయ్యాక అల్లంవెల్లుల్లి తరుగు వేయాలి.   Step 5 అవి కాస్త వేగాయనుకున్నాక కారం, సోయా, చిల్లీసాస్‌, కొద్దిగా ఉప్పూ, మిరియాలపొడి వేసి పెద్దమంటపై వేయించాలి.   Step 6 ఇందులో ముందుగా వేయించుకున్న పుట్టగొడుగు ముక్కల్ని వేసి బాగా కలిపి దింపేసి ఉల్లికాడల తరుగు వేస్తే చాలు.          
Yummy Food Recipes
Add
Recipe of the Day