Atukula upma recipe By , 2017-03-18 Atukula upma recipe Here is the process for Atukula upma making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: అటుకులు- 1 కప్పు,,పచ్చిమిర్చి- 3,,పెద్ద ఉల్లిపాయ- 1/2,,వేరుశెనగ పప్పు- 2 టేబుల్ స్పూన్స్ ,,పచ్చి బఠాణి -3 టేబుల్ స్పూన్స్,,క్యారెట్- 1,,ఉడికించిన బంగాళాదుంప ముక్కలు- 3/4 కప్పు(లేకపోయినా పర్లేదు ),,ఉప్పు-తగినంత,,పచ్చిపప్పు- 1 టేబుల్ స్పూన్,,జీలకర్ర- 1/2 టీస్పూన్,,వెల్లుల్లి ముక్కలు- 1/2 టీస్పూన్,,పసుపు- 1/4 టీస్పూన్,,కొత్తిమీర - కొద్దిగా,,కరివేపాకు- 2 రెమ్మలు,,నిమ్మరసం -2 టేబుల్ స్పూన్స్., Instructions: Step 1 ముందుగా అటుకులని నీళ్లతో శుభ్రం చేసుకొని నీరు లేకుండా పిండి పక్కన పెట్టుకోవాలి. Step 2 తరువాత స్టవ్ మీద కడాయి పెట్టుకుని వేడి అయ్యాక పచ్చిపప్పు, జీలకర్ర, వేరుశెనగ పప్పు, కరివేపాకు వేసి వేగించుకుని దానిలో ఉల్లిపాయ ముక్కలు ,బంగాళాదుంప ముక్కలు, పచ్చి బఠాణి , క్యారెట్ ముక్కలు ,పసుపు, ఉప్పు వేసుకుని మీడియం మంట మీద మూత పెట్టుకుని 5 నిమిషాలు వేయించుకోవాలి. Step 3 చివరగా తడిపి పెట్టుకున్న అటుకులని వేసి బాగా కలయపెట్టుకొని ఉప్పు సరిచూసుకుని ,నిమ్మరసం వేసి కలిపి కొత్తిమీర చల్లుకుని అలంకరించుకోవాలి. Step 4 (నిమ్మరసం బదులు ఎండు మామిడి పొడి కూడా వేసుకోవచ్చు) అంతే ఎంతో తేలిక అయిన మరియు రుచికరమైన అటుకుల ఉప్మా రెడీ.  
Yummy Food Recipes
Add
Recipe of the Day