Ragi Rava Dosa Recipe By , 2017-02-09 Ragi Rava Dosa Recipe Here is the process for Ragi Rava Dosa making .Just follow this simple tips Prep Time: 20min Cook time: 40min Ingredients: రాగి పిండి : 1 కప్,బొంబాయి రవ్వ : 2 కప్స్,బియ్యంపిండి : 1 కప్,శనగపిండి : 2 స్పూన్స్,సాల్ట్ : తగినంత,జీలకర్ర : 1 స్పూన్,ఆయిల్ : సరిపడంతా,ఉల్లిపాయ : 1,పచ్చిమిర్చి : 1, Instructions: Step 1 ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులో రాగి పిండి, బొంబాయి రవ్వ, బియ్యంపిండి, శనగపిండి జీలకర్ర, సాల్ట్ వేసి, వాటర్ వేస్తూ పలచగా కలుపుకోవాలి. Step 2 తయారైన ఈ పిండి ని 10 నిముషాలు పక్కన ఉంచుకోవాలి . అలాగే పచ్చిమిర్చి ఉల్లిపాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి . Step 3 ఇప్పుడు స్టవ్వు వెలిగించి దోస పెనం పెట్టి బాగా వేడి అయ్యాక, కొంచెం ఆయిల్ రాసి పెనం అంత స్ప్రెడ్ చేయాలి . Step 4 ఇప్పుడు దాని మీద కొంచెం వాటర్ చల్లి అప్పుడు పిండి ని గరిట తో తీసుకుని పెనం మీద వేసుకోవాలి (దోస లాగ గరిటతో పరచ కూడదు ) ,దాని పైన తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసుకుని, కొంచెం ఆయిల్ దోస చుట్టూ వేసుకుని రెండు వైపులా కాల్చుకుని తీసుకోవాలి . అంతే క్రిస్పీ, క్రిస్పీ రాగి రవ్వ దోస రెడీ …
Yummy Food Recipes
Add
Recipe of the Day