dosakaya pickle recipe By , 2017-07-21 dosakaya pickle recipe Here is the process for dosakaya pickle making .Just follow this simple tips Prep Time: 5min Cook time: 10min Ingredients: దోసకాయ : ఒకటి,ఎండిమిర్చి: ఆరు (పచ్చిమిర్చితో కూడా చెయ్యొచ్చు),నూనె : రెండు టేబుల్ స్పూన్లు,పోపుదినుసులు : టేబుల్ స్పూన్,ఉప్పు : తగినంత,వెల్లుల్లి రేకలు : ఆరు,చింతపండు : ఉసిరి కాయంత, Instructions: Step 1 దోసకాయను చెక్కు తీసి ముక్కలుగా చేయాలి. Step 2 స్టవ్ వెలిగించి కళాయిలో నూనె వేడి చేసి ఎండిమిర్చి, మినపప్పు, సెనగపప్పు వేసి దోరగా వేపాలి. Step 3 ఇవి తీసి అదే నూనెలో దోసకాయ ముక్కలు వేసి మగ్గనివ్వాలి. Step 4 మిక్సి జార్లో వేపిన మిశ్రమాన్ని, ఉప్పు, వెల్లుల్లిని చింతపండు వేసి మెత్తగా మిక్సి చెయ్యాలి. దీనిలో మగ్గిన దోసముక్కలు వేసి ఒక సెకన్ తిప్పాలి (మిక్సి బటన్ అన్ చేసి ఆఫ్ చెయ్యటం). Step 5 దోసకాయ మెత్తగా అయితే బాగుండదు. కచ్చపచ్చగా ఉంటేనే బాగుంటుంది. Step 6 ఇప్పుడు స్టవ్ మీద కళాయిలో నూనె వేసి పోపుదినుసులు, కరివేపాకు, వెల్లుల్లి వేసి వేగాక, పచ్చడి పోపు వెయ్యాలి.   **అంతే దోసకాయ పచ్చడి రెడి.**
Yummy Food Recipes
Add
Recipe of the Day