chikkudu pickle recipe By , 2017-01-26 chikkudu pickle recipe Here is the process for chikkudu pickle making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: చిక్కుడుకాయ ముక్కలు. 2 కప్పులు,చింతపండుగుజ్జు. 1 కప్పు,కారం. 1/2 కప్పు,నూనె. 1 కప్పు,ఉప్పు. 1/4 కప్పు,మెంతులు. 4 టీస్పూ,పసుపు. 1 టీస్పూ,మినప్పప్పు. 1 టీస్పూ,సెనగపప్పు. 1 టీస్పూ,కరివేపాకు. 2 రెబ్బలు,వెల్లుల్లిపాయలు. 2,ఆవాలు. 4 టీస్పూ, Instructions: Step 1 చిక్కుడుకాయ ముక్కలు శుభ్రంగా కడిగి పొడిబట్టమీద ఆరనివ్వాలి. చింతపండు గుజ్జుని ఓ బాణెలిలో వేసి ఉడికించాలి. Step 2 మరో బాణెలిలో సగం నూనె పోసి ఆరిన చిక్కుడుకాయల ముక్కలు వేసి వేయించాలి. తరువాత వీటిని చింతపండు గుజ్జులో వేయాలి. Step 3 ఇప్పుడు మిగిలిన నూనె కూడా బాణెలిలో పోసి పోపు సామాను అంతా వేసి ఎర్రగా వేయించాలి. Step 4 అందులోనే పొట్టు ఒలిచిన వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి కొద్దిసేపు వేయించాలి. తరువాత కారం, కరివేపాకు వేసి అన్నింటినీ చింతపండు గుజ్జులో వెయ్యాలి. Step 5 ఉప్పు, పసుపు కూడా వేసి అన్నీ కలిసేలా బాగా కలిపి పొడిగా ఉన్న సీసాలో పెట్టుకోవాలి. ఒక రోజు ఊరితే బాగుంటుంది. అంతే చిక్కుడు ఊరగాయ రెడీ .
Yummy Food Recipes
Add
Recipe of the Day